Chandrababu : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల వలన వరదలు పోటెత్తాయి. రాష్ట్రంలో భారీ వర్షాలపై చంద్రబాబు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఆపదలో ఉన్నవారికి ఎవరికి ఎలాంటి సమయ్య లేకుండా చూసుకోవాలని చంద్రబాబు అధికారులకి సలహా ఇచ్చారు. అయితే చంద్రబాబు నిద్ర లేకుడా తిరుగుతున్న కూడా పవన్ కళ్యాణ్ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. దీంతో అందరిలో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ వరదలపై స్పందించారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ఎప్పటికప్పుడు వాతావరణ హెచ్చరికలు అందించే ఏర్పాట్లు చేసిందని వెల్లడించారు.
అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారని… వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపడుతున్న సహాయక చర్యల్లో జనసేన, టీడీపీ, బీజేపీ శ్రేణులు అధికారులకు సాయంగా ఉండాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ప్రజలకు ఆహారం, రక్షిత తాగునీరు, వైద్య సహాయం అందించడంలో తోడ్పాటునివ్వాలని సూచించారు. ఇక, విజయవాడలో కొండచరియలు విరిగిపడిన ఘటనపైనా పవన్ కల్యాణ్ స్పందించారు. కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి చెందారని తెలిసి విచారానికి లోనయ్యానని పేర్కొన్నారు. ఈ ఘటన దురదృష్టకరమని, మృతి చెందినవారి కుటుంబాలను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నానని పవన్ వెల్లడించారు. గాయపడిన వారికి ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలందిస్తుందని తెలిపారు.
భారీ వర్షాలతో అకస్మాత్తుగా విరుచుకుపడిన వరదలు ముంచెత్తడంతో పవన్ కల్యాణ్ తన అభిమానులకు, పార్టీ శ్రేణులకు వరద బాధితులకు అండగా నిలవాలని పిలుపునివ్వడంతో పూర్తిగా ఆవైపుగా దృష్టిసారిస్తున్నారు ఆయన అభిమానులు, పార్టీశ్రేణులు.. డిప్యూటీ సీఎంగా, మంత్రిగా వ్యవహరిస్తున్న పవన్ కల్యాణ్ పుట్టిన రోజు వేడుకలు అంబరాన్ని అంటేలా చేయాలనుకున్న అభిమానులు కొంత నిరాస పడినా తన అభిమాన నేత సూచనల మేరకు వరద ఫ్రభావిత ప్రాంతాలకు సోమవారం తరలి వెళ్లారు .. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా పవన్ కళ్యాణ్ గారు బాలయ్య వేడుకకి రాలేకపోయారు. ఆయన తరపున నేను వచ్చాను. పవన్ కళ్యాణ్ గారు అక్కడ సహాయక చర్యల్లో ఉన్నారు. బాలకృష్ణ గారికి పవన్ కళ్యాణ్ గారు శుభాకాంక్షలు తెలియచేసారు. బాలయ్య గారు సినిమా, వైద్య, రాజకీయ రంగంలో ఇలాగే కొనసాగాలి అని కోరుకుంటున్నాను అని కందుల దుర్గేష్ అన్నారు.