Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి వైసీపీ నియోజకవర్గాల వారీగా ఇన్చార్జి లను మారుస్తూ తీసుకుంటున్న నిర్ణయం చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటు లేకుండా చేస్తుంది . ఇక తాజాగా ఆ ఖాతాలో ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా పడ్డారు. అనకాపల్లిలో వైసిపి కార్యాలయంలో కొత్త నియోజకవర్గ ఇన్చార్జిగా సీఎం జగన్మోహన్ రెడ్డి నియమించిన మలసాల భరత్ కుమార్ పరిచయ సమావేశంలో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
తాను అనకాపల్లి నియోజకవర్గం వీడి వెళుతున్నందుకు బాధగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. తీవ్ర భావోద్వేగానికి లోనైన గుడివాడ అమర్‌నాథ్ ఎంతో బాధతో వెళుతున్నా.. కానీ మీ రుణం ఎప్పటికైనా తీర్చుకుంటానంటూ ఎమోషనల్ గా మాట్లాడారు. మీతో కార్యకర్తగా జెండా మోయటానికి సిద్ధంగా ఉన్నానని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడ్డామని, అధికారం వచ్చాక కొంతమందికే పదవులు వచ్చాయని కొందరు ప్రచారం చేస్తున్నారని అలా ప్రచారం చేసే వాళ్ళు పార్టీలో ఉండడం కంటే వెళ్ళిపోవడమే మంచిది అంటూ వ్యాఖ్యలు చేశారు.
గుడివాడ అమర్నాథ్ ఎక్కువగా పిట్లకథలు,కోడి గుడ్డు కథలు చెప్పి సమాధానం దాటవేసేవారు. అంతేకాదు పవన్ కల్యాణ్ తనతో ఫొటో దిగడానికి వచ్చాడని ఏవేవో కహానీలు చెప్పేవాడు. కాని ఇప్పుడు ఆయనని తప్పించే సరికి చంద్రబాబు అమర్‌నాథ్ గుడ్డు పగిలింది, సీటు చినిగింది అంటూ సెటైర్స్ వేస్తున్నారు. ఇక పవన్ కల్యాణ్‌ని తిడితే రోజా గతి కూడా అంతేనని చంద్రబాబు అన్నారు.ఇక రాష్ట్రాల్లోని 13 లక్షల కోట్ల అప్పుల్లోకి వై.ఎస్.జగన్ నెట్టారని ఆరోపించారు. రూ.100 దోచుకుని రూ.10 చేతిలో పెట్టి గొప్ప దానకర్ణుడనని చంకలు ఎగరేసుకుంటున్నారని విమర్శించారు చంద్రబాబు.