Chandrababu : చంద్ర‌బాబు మాట్లాడుతుండ‌గా, ఒక్క‌సారిగా స్టేజ్ పైకి వ‌చ్చిన వైసీపీ ఎమ్మెల్యే.. త‌ర్వాత ఏం జ‌రిగింది..!

Chandrababu : మాజీ సీఎం చంద్రబాబు ప్ర‌స్తుతం ప్ర‌చార కార్యక్ర‌మాల‌లో బిజీగా ఉన్నారు. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో సోమవారం నిర్వహించిన రా… కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. ‘చింతలపూడి సభ చూస్తుంటే… గెలిచేది మనమేనని, ఇందులో అనుమానం లేదనిపిస్తుంది. మరో రెండు నెలల్లో సైకో జగన్‌ను ఇంటికి పంపాల్సిందే. యువత మొత్తం తెలుగుదేశం, జనసేనలోనే ఉన్నారు. మీరు తలుచుకుంటే మన విజయాన్ని ఆపే దమ్ము ఎవరికీ లేదు. ఈ గెలుపు మనకోసం కాదు. ఒక కుటుంబ పెద్ద తాగుబోతు అయితే ఆ కుటుంబం చితికిపోతుంది. రాష్ట్ర పెద్ద సైకో అయితే అంతా సర్వనాశనం అవుతుంది. జగన్ రెడ్డి దిగిపోవడం కాదు.

ప్రజలే జగన్ ని బరించే స్థితిలో లేరు. రాష్ట్ర ప్రజలను రూ.12 లక్షల కోట్లు అప్పుల్లో ముంచాడు. జగన్ నాశనం చేసిన రాష్ట్రాన్ని పున:నిర్మించుకోవడంలో మీ అందరి సహకారం కావాలి’ అన్నారు చంద్రబాబు. జగన్ తాను అర్జునుడితో పోల్చుకుంటున్నారు.. ముమ్మాటికీ ఏపీ సీఎం అక్రమార్జనుడేనని చంద్రబాబు ఎద్దేవా చేశారు. పులివెందుల కుటుంబ పంచాయతీని రాష్ట్ర సమస్యగా చేయాలని చూస్తున్నారని.. కేసుల నుంచి బయటపడేందుకు తండ్రి వైఎస్ పేరును ఎఫ్ఐఆర్ లో పెట్టించిన ఘనుడు జగన్ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇక ఇదే వేదిక‌పైన వైసీపీ మాజీ ఎమ్మెల్యే గాంధీ టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు.

Chandrababu comments on cm ys jagan
Chandrababu

చిత్తూరు జిల్లాలో వైఎస్సార్‌సీపీకి ఎదురు దెబ్బ తగిలింది. పార్టీలో దళితులకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా తన పదవికి, పార్టీ సభ్యత్వానికీ రాజీనామా చేసినట్లు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ పొలిటికల్‌ అడ్వైజరీ కమిటీ సభ్యుడు ఆర్‌ గాంధీ తెలిపారు. వైఎస్సార్‌సీపీ అధికారం చేపట్టిన నాటి నుంచి దళితులు, బీసీలపై దాడులు పెరగడంతో పాటు రాజకీయంగా ఆ వర్గాలను అణగదొక్కుతున్నారని ఆరోపించారు. తాను దళితుడిని కావడం వల్లనే పార్టీ, మంత్రి పెద్దిరెడ్డి తనకు తగిన గుర్తింపు ఇవ్వలేదన్నారు. నియోజకవర్గ సమస్యలను సీఎం జగన్‌కు విన్నవించడానికి అపాయింట్‌మెంట్ ఇవ్వాలని సీఎం కార్యాలయ అధికారులను వేడుకున్నా స్పందించక పోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యానన్నారు. అవ‌న్నీ భ‌రించ‌లేక గాంధీ..టీడీపీలో చేరారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago