Chandra Hass : మాల‌లో ఉన్నా కూడా ప్ర‌భాక‌ర్ త‌న‌యుడిని వ‌దిలి పెట్ట‌డం లేదుగా..!

Chandra Hass : బుల్లితెర స్టార్ ప్ర‌భాక‌ర్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న చాలా సీరియ‌ల్స్‌తో పాటు, సినిమాల‌లో న‌టించి మెప్పించాడు. ఇప్పుడు ఆయ‌న త‌న‌యుడిని ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేయాల‌ని చూస్తుండ‌గా, ప్ర‌స్తుతం మూడు సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. అయితే ప్ర‌భాక‌ర్ త‌న‌యుడు చంద్రహాస్ హీరోగా పరిచయం అయ్యే ముందు ఆయ‌న విమ‌ర్శ‌ల బారిన ప‌డుతున్నాడు. ఆ మ‌ధ్య ప్రెస్ మీట్‌లో యాటిట్యూడ్ చూపించాడ‌ని విమ‌ర్శ‌లు చేయ‌గా, ఇప్పుడు ఆయ‌న ఫోటోల‌ని ఉద్దేశించి టార్గెట్ చేస్తూ కామెంట్ చేస్తున్నారు.

తాజాగా ప్రభాకర్‌ తనయుడు చంద్రహాస్‌ అయ్యప్ప స్వామి మాలలో ఉన్నాడు. ఆయ‌న కొత్త కారు కొన్న విషయాన్ని, అలాగే ఫ్యామిలీతో కలిసి ఆధ్యాత్మిక టూర్‌కి వెళ్తున్నట్టుగా విషయాన్ని షేర్‌ చేసుకుంటూ ఫోటోలను పోస్ట్ చేశాడు చంద్రహాస్‌. అయితే ఇందులో చంద్రహాస్‌ ఇచ్చిన పోజులు వివాదంగా, విమర్శలకు తావిస్తుంది. తన కొత్త కారుపై ఆయన ఇచ్చిన స్టయిలీష్‌ పోజులు చూసి నెటిజన్లు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇందులోనూ ఆయన యాటిట్యూడ్‌ చూపిస్తున్నారని నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. స్వామి మాలలో ఉండి ఇలాంటి పిచ్చి వేశాలేంటి స్వామి..అంటూ మండిప‌డుతున్నారు.

Chandra Hass being trolled by netizen again
Chandra Hass

స్వామి మాల వేసి మా నోళ్లు మూయించావని, లేదంటూ ఈ సారి గట్టిగా ట్రోల్ చేసేవాళ్ల‌మ‌ని కొంద‌రు ఈయ‌న‌పై విరుచుకుప‌డుతున్నారు. ఇక చంద్రహాస్‌ హీరోగా పరిచయం అయిన చిత్రానికి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. దీంతోపాటు ఏవీఆర్‌ మూవీ వండర్స్ సంపత్‌ వి రుద్ర దర్శకత్వంలో ఓ సినిమా, ప్రభాకర్‌ సొంత నిర్మాణ సంస్థ శ్రీ సుమనోహర ప్రొడక్షన్స్ లో మరో సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఎంట్రీతోనే మూడు సినిమాలు లైనప్‌లో ఉండటం విశేషమనే చెప్పాలి. మొత్తానికి ప్రభాకర్‌ తన కుమారుడిని హీరోగా నిలబెట్టేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. మ‌రి ఈ విమ‌ర్శ‌ల మ‌ధ్యఆయ‌న ఎలా రాణిస్తాడు అనేది చూడాలి.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

15 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 days ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

5 days ago