Chandra Babu With Family : స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో భాగంగా దాదాపు 52 రోజుల పాటు జైలులో ఉన్న నారా చంద్రబాబు నాయుడు అనారోగ్య కారణాలతో హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి బయటకొచ్చారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు.జైలు నుంచి బయట వచ్చిన వెంటనే నారా లోకేష్, బ్రాహ్మణి, దేవాన్ష్, బాలకృష్ణ ఆయన వద్దకు వెళ్లారు. మనవడు దేవాన్షన్‌ని చూసి చంద్రబాబు భావోద్వేగానికి లోనయ్యారు.దేవాన్ష్ ని చూడగానే చంద్రబాబు ఎమోషనల్ అయ్యారు. దేవాన్ష్ తన తాతను హత్తుకున్నాడు.
చంద్రబాబు ఎంతో ప్రేమగా మనవడిని దగ్గరికి తీసుకుకొని, దేవాన్ష్ ని ముద్దాడారు. దేవాన్ష్ వెంట నారా బ్రాహ్మణి, బాలకృష్ణ ఉన్నారు. వారిని కూడా చంద్రబాబు పలకరించారు. ఆ తర్వాత అచ్చెన్నాయుడు సహా పలువురు టీడీపీ నేతలను పలకరించారు చంద్రబాబు. అనంతరం భారీగా చేరుకున్న పార్టీ శ్రేణులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పసి హృదయాల్లో జైలు వాతావరణం చూసి కలుషితం అవుతుందని భావించిన కుటుంబ సభ్యులు చంద్రబాబుతో ములాఖత్ కు దూరంగా ఉంచారు. దీంతో తాతయ్యకు దేవాన్ష్ దాదాపు రెండు నెలలు దూరంగా ఉండాల్సి వచ్చింది.
చంద్రబాబు ఎక్కడ ఉన్నా వీకెండ్ లో హైదరాబాద్ కు వస్తుండటంతో తాతయ్యతో ఆటలు, పాటలతో సరదాగా దేవాన్ష్ ఉండేవారని అంటున్నారు. అలాంటిది గత యాభై రెండు రోజుల నుంచి జైలులో ఉండటంతో దేవాన్ష్ ను కుటుంబ సభ్యులు చంద్రబాబు వద్దకు తీసుకెళ్లకుండా దూరంగా ఉంచారు. జైలు నుంచి బయటకు అడుగు పెట్టిన వెంటనే చంద్రబాబు తొలి చూపు మనవడు దేవాన్ష్ పైనే పడింది. దేవాన్ష్ కూడా తాతను పెనవేసుకుని కాసేపు అలా నిలుచుండిపోవడం అక్కడ చూసే వారికి కంట తడి పెట్టించింది. దేవాన్ష్ ను హత్తుకున్న ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.