Chandra Babu : తెలంగాణ ఎన్నికలు పూర్తయ్యాయి. ప్రజలు కొత్త ప్రభుత్వానికి పట్టం కట్టారు. ఇక ఇప్పుడు ఏపీ ఎన్నికలపై అందరి దృష్టి ఉంది.అయితే ఆంధ్రప్రదేశ్ తాజా రాజకీయ పరిస్థితులు, వచ్చే ఎన్నికల్లో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ సాధనే ప్రధాన అజెండాగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ , తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక భేటీ హైదరాబాద్ లో జరిగింది. హైదరాబాద్ మాదాపూర్‌లోని పవన్ ఇంట్లో ఏపీ ఎన్నికల వ్యూహాలు, టీడీపీ-జనసేన సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిగాయి.. అలాగే, ఎన్నికల మ్యానిఫెస్టో రూపకల్పనపై కూడా చర్చించినట్టు తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లిన చంద్రబాబు నాయుడు దాదాపు రెండున్న గంటల పాటు పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. చంద్రబాబును పవన్ కళ్యాణ్ సాదర స్వాగతం పలికారు. రెండున్నర గంటలపాటు సుదీర్ఘంగా సాగిన కీలక భేటీలో పలు రాజకీయ అంశాలపై ఇరు పార్టీల అధినేతలు చర్చించారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. సీట్ల సర్దుబాటుపై తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తోంది. మరికొన్ని సమావేశాల తర్వాత.. సంక్రాంతి నాటికి ఇది కొలిక్కి రానున్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి మ్యానిఫెస్టో పైనా ఇద్దరు నేతలూ చర్చించారు.
ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలి? ఎక్కడ నుంచి బరిలో దిగాలనే అంశంపై నేతలు చర్చించారు. ఉమ్మడి మ్యానిఫెస్టోలో ఏయే అంశాలు పెట్టాలి? దాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం తదితర అంశాలపైనా ఇద్దరి మధ్య చర్చ నడిచింది. ఉమ్మడిగా బహిరంగ సభల నిర్వహణ, ఎక్కడెక్కడ సభలు నిర్వహించాలి, ఎవరెవరు హాజరవ్వాలి? వాటిని ఎప్పట్నుంచి ప్రారంభించాలనే అంశాలపైనా ఇద్దరు నేతలూ చర్చించారు. ఇక అన్ని అంశాలు ముచ్చటించుకున్న తర్వాత పవన్ కళ్యాణ్, అన్నా లెజీనోవాలతో కలిసి చంద్రబాబు ఫొటో దిగారు. ఇది అందరి దృష్టిని ఆకర్షించింది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…