Chandra Babu : ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు రోజురోజుకి మరింత రంజుగా మారుతున్నాయి. ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటూ హాట్ టాపిక్‌గా నిలుస్తున్నారు. వైసీపీ నుండి రోజా ప్రత్యర్ధులపై దారుణమైన విమర్శలు గుప్పిస్తుంది. 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు రాయలసీమకు ఒక్క ప్రాజెక్టు అయినా తీసుకొచ్చాడా అని ఆమె ప్రశ్నించారు. తాగునీటి ప్రాజెక్టు గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని, చంద్రబాబు రాయలసీమ ద్రోహి అని ఆమె విమర్శించారు. రాయలసీమలో ఒక్క నీటి ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేని చంద్రబాబు, కనీసం చిత్తూరు జిల్లాలో పుట్టి పెరిగిన చంద్రబాబు జిల్లాలో కూడా ఒక్క ప్రాజెక్టును తీసుకుని రాలేదని అన్నారు.
ఏపీలో శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులలో ఒకటైన పూర్తి చేసింది చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. పోలవరాన్ని 2018 లోనే పూర్తి చేస్తానన్న చంద్రబాబు ఎందుకు పూర్తి చేయలేదో సమాధానం ఇవ్వాలని అన్నారు. అయితే రోజా వ్యాఖ్యలకి చంద్రబాబు దిమ్మతిరిగిపోయే పంచ్‌లు ఇస్తూ ఆమె నోట మాట రాకుండా చేశారు. ఇప్పటివరకు జగన్ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ వచ్చిన బాబు.ఇప్పుడు అభివృద్ది మంత్రాన్ని జపిస్తున్నారు.జగన్ పాలనలో రాష్ట్రం రావణకాష్టలా మారుతుందని వ్యాఖ్యానిస్తు ప్రజలను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో విజన్ 2047 కార్యక్రమాన్ని చేపట్టారు.టీడీపీ అధికారంలోకి వస్తే 2047 నాటికి ఏపీలో భారత్ లోనే నెంబర్ ఒన్ రాష్ట్రంగా తీర్చి దిద్దుతానని చెబుతున్నారు చంద్రబాబు.
స్మార్ట్ సిటీలు అంటూ, సింగపూర్ తరహా డెవలప్ మెంట్ అంటూ ఇలా రకరకాల మాటలు చెప్పిన బాబు.ఏ ఒక్కటి నెరవేర్చలేదనేది చాలమంది చెబుతున్నా మాట.దీంతో మళ్ళీ ఇప్పుడు ఎన్నికలవేళ డెవెలప్ మెంట్ పేరుతో విజన్ 2047 తీసుకొస్తున్నాప్పటికి చంద్రబాబు హామీలు ప్రజల్లో ప్రజల్లో పెద్దగా ఇంపాక్ట్ చూపిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది.