Chandra Babu : ప్రస్తుతం ఏపీ రాజకీయాలు ఏ రేంజ్ లో హీటెక్కిపోతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. అధికార పక్షంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుండగా, వారు కూడా ధీటుగా బదులిస్తున్నారు. ఇక ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటూ రచ్చ చేస్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ రుషికొండకి వెళ్లి అక్కడ పరిస్థితులని వివరించే ప్రయత్నం చేయగా, దానికి రోజా ఎవడ్రా నువ్వు అంటూ దారుణమైన కామెంట్ చేసింది. దీనిపై ప్రతి ఒక్కరు మండిపడుతున్నారు . చంద్రబాబు కూడా రోజా మాటలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుళ్లు కొండపైన లేరా, మేము కట్టుకుంటే ఏంటి తప్పు అన్నట్టు వారి మాటలు ఉన్నాయి. ఐదేళ్లు చాలా ఇబ్బంది పడ్డాం. ఇక వారి ఆటలు సాగనివ్వం అంటూ రోజా, జగన్‌తో పాటు వైసీపీ నాయకులకి కూల్ వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు.
వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత.. పేద మధ్యతరగతి కుటుంబాలు బ్రతకడం బరువైపోయాయని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ ముఖ్య మంత్రి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ఏం చేశారు అంటూ ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎనిమిది సార్లు కరెంటు చార్జీలు పెంచారని.. ఇలా అయితే పేదవాడు ఈ రాష్ట్రంలో ఎలా బతుకుతాడంటూ చంద్రబాబు ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కచ్చితంగా ఈ చార్జీలు తగ్గిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
వ్యవస్థలను జగన్ నాశనం చేశారని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక సర్పంచుల ఆధ్వర్యంలోనే పంచాయతీల పనులు చేయిస్తామని చెప్పారు. 25 వేల కిలోమీటర్లు రోడ్డు వేసిన ఏకైక ప్రభుత్వం టీడీపీ అని చంద్రబాబు నాయుడు తెలిపారు.మరో ఆరు నెలల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని.. రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు. వైసీపీ ప్రభుత్వం కంటే సంక్షేమ పథకాలు అధికంగా అందిస్తామని పేర్కొన్నారు. విభజన సమస్య కంటే గత ఐదేళ్లలోనే రాష్ట్రా పరిపాలన కారణంగా అధిక నష్టం వాటిలిందని చంద్రబాబు విమర్శించారు.