Chandra Babu : స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు నెల రోజులకి పైగా జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఆయన ఎప్పుడెప్పుడు విడుదల అవుతాడా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో తమ్ముళ్లకి గుడ్ న్యూస్ అందింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం బెయిల్ కు సంబంధించిన ష్యూరిటీలను టీడీపీ నేతలు సమర్పించారు. కోర్టు ఉత్తర్వులు కూడా సెంట్రల్ జైలుకు చేరుకున్నాయి. ఈ క్రమంలో కాసేపట్లో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి చంద్రబాబు విడుదల కానున్నారు. 52 రోజుల తర్వాత ఆయన స్వేచ్ఛా వాయువులు పీల్చుకోనున్నారు.
చంద్రబాబు విడుదల అవుతున్న నేపథ్యంలో జైలు వద్దకు ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఎన్ఎస్జీ కమెండోలు చేరుకున్నారు. చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్, కోడలు బ్రాహ్మణి కూడా జైలు వద్దకు చేరుకున్నారు. మరోవైపు జైలు వద్ద భారీ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఏ ఒక్క టీడీపీ నేత కూడా అక్కడకు రాకుండా అడ్డుకుంటున్నారు. ఇంకోవైపు, జైలు నుంచి అమరావతిలోని ఉండవల్లి నివాసం వరకు చంద్రబాబు భారీ ర్యాలీగా వెళ్లనున్నారు. ర్యాలీకి సంబంధించిన ఏర్పాట్లను టీడీపీ నేతలు పూర్తి చేశారు.
టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు , తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు చంద్రబాబును స్వాగతించడానికి చేరుకున్నారు.రాజమండ్రికి పెద్ద సంఖ్యలో టిడిపి నేతలు, అభిమానులు చేరుకోవడంతో అక్కడ సందడి వాతావరణం చోటు చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు, కార్యకర్తలు స్వీట్లు పంచుకుంటూ బాణాసంచా కాల్చుతూ సంబరాలు జరుపుకుంటున్నారు. బాబు ఈజ్ బ్యాక్, నిజం గెలిచింది వంటి హాష్ టాగ్ లను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబుకు బెయిల్ రావడంతో టీడీపీలో హడావిడి కొనసాగుతుంటే తెలుగు తమ్ముళ్ళు చంద్రబాబు అవసరం ఏపీకి ఉందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
చంద్రబాబు రాజమండ్రి పాత హైవే మీదుగా అమరావతి లోని తన నివాసానికి చేరుకోనున్నారు. వేమగిరి, రావులపాలెం, పెరవలి, తణుకు, తాడేపల్లిగూడెం, భీమడోలు, దెందులూరు, ఏలూరు, హనుమాన్ జంక్షన్, గన్నవరం మీదుగా అమరావతిలోని ఉండవల్లిలోని తన నివాసానికి చంద్రబాబు ఈరోజు రాత్రికి చేరుకుంటారు . అనంతరం చంద్రబాబు హైదరాబాద్ కు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు. చంద్రబాబు బెయిల్ పై బయటకు రావడంతో తెలుగు తమ్ముళ్లు ఊపిరి పీల్చుకుంటున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…