Chandra Babu : ఏపీ నీటిపారుదల శాఖమంత్రి అంబటి రాంబాబు పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదల సమయంలో ప్రాజెక్టుల పనితీరు సంగతి వదిలేసి..పవన్ కళ్యాణ్ బ్రో సినిమాపై మాట్లాడాల్సిన అవసరం ఏం ఉందంటూ మండిపడ్డారు చంద్రబాబు. రాష్ట్రంలో ప్రాజెక్టుల గురించి మాట్లాడమంటే… పవన్ కళ్యాణ్ నటించిన “బ్రో” సినిమా గురించి మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు.నువ్వు మంత్రా లేకపోతే “బ్రో” సినిమాలో నటించే బ్రోకరా.? ప్రాజెక్టుల గురించి సమాధానం చెప్పమంటే “బ్రో” సినిమాపై చర్చ పెడతావా అంటూ ఎద్దేవా చేశారు. మరోవైపు జగన్‌పై కూడా విమర్శలు చేశారు చంద్రబాబు.
అయితే అంబటి రాంబాబు కొద్ది రోజులుగా హాట్ టాపిక్‌గా మారుతున్నారు. జులై 28వ తారీకున విడుదలైన బ్రో సినిమాలో అంబటి రాంబాబుది శ్యాం బాబు పాత్ర. అంబాటి రాంబాబు మాదిరిగా ఉన్నట్లు వార్తలు రావడంతో దీనిపై అంబటి తీవ్రస్థాయిలో మండి పడటం జరిగింది.ఇక ఈ సినిమా నిర్మాత విశ్వ ప్రసాద్ కి తెలుగుదేశం పార్టీ నుండి డబ్బు అందుతుందని.“బ్రో” సినిమా వెనక బ్లాక్ మనీని వైట్ గా మార్చే కుట్ర జరిగిందని ఆరోపించారు.దీంతో “బ్రో” సినిమా వివాదం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.ఈ క్రమంలో పులివెందుల పర్యటనలో మంత్రి అంబటిపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.
చంద్రబాబు వ్యాఖ్యల తర్వాత అంబటి విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు తనను ఆంబోతు అన్నారని, అయితే ఆంబోతులకు ఆవులని సప్లై చేసేది చంద్రబాబా అని సెటైర్లు వేశారు. ఎన్టీఆర్ అల్లుడవ్వడంతోనే చంద్రబాబు సీఎం అయ్యారన్నారు.
కిందిస్థాయి నుంచి వచ్చిన తనను ఆంబోతు అని ఇష్టానుసారం మాట్లాడతారా? అంటూ మండిపడ్డారు. చంద్రబాబు ఇంటి పేరు శని అని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఈ శనిని వదిలించుకుంటారన్నారు. పోలవరం ప్రాజెక్టుకు, రాష్ట్రానికి పట్టిన శని చంద్రబాబు అని విమర్శించారు. తమ వారికి కాంట్రాక్ట్ ఇస్తే డబ్బులు వస్తాయని చంద్రబాబు పోలవరం చుట్టూ ప్రదక్షిణలు చేశారన్నారు.