Chandra Babu : మే 13న ఏపీలో ఎన్నికలు జరగనుండగా, రాజకీయం మరింత వేడెక్కుతుంది.ఈ క్రమంలో రాజకీయం మరింత వేడెక్కిస్తున్నారు. : సీఎం జగన్ విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు, గోపాలపురం నియోజకవర్గాల్లో గురువారం నిర్వహించిన ‘ప్రజాగళంస సభల్లో ఆయన ప్రసంగించారు. ఐదేళ్లలో రాష్ట్ర ప్రజల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారని ధ్వజమెత్తారు. వైసీపీ డీఎన్ఏలోనే శవ రాజకీయం ఉందని.. రక్తంలో మునిగిన ఆ పార్టీకి ఓట్లు వెయ్యొద్దని అతని తల్లి చెల్లి కోరుతున్నారని అన్నారు. హత్యలు, శవ రాజకీయాలు చేసే వారు ప్రజలకు కావాలా.? అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని, ప్రజల ప్రయోజనాలు కాపాడుకోవడానికే జనసేన, బీజేపీతో జత కట్టామని పునరుద్ఘాటించారు.
జగన్ విధ్వంస పాలన చేశారని.. ఏపీని సర్వనాశనం చేశారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వైసీపీ పాలనపై నిప్పులు చెరిగారు. రాష్ట్రాన్ని కాపాడుకోడానికే కూటమిగా జతకట్టామని తెలిపారు. వాలంటీర్ వ్యవస్థకు తాను వ్యతిరేకం కాదని .. కానీ ఒక ప్రభుత్వ వ్వవస్థ రాజకీయ పార్టీకి మద్దతు తెలపరాదని.. కేవలం ప్రజలకు సేవ చేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్వవస్థను కొనసాగిస్తామని తెలిపారు. ఇంటింటికీ వెళ్లి పెన్షన్ ఇచ్చే వీలు సచివాలయ సిబ్బందికి ఉందని.. అయినా ఇవ్వడం లేదని పేర్కొన్నారు.
వైసీపీ ప్రభుత్వం పెన్షను ఇవ్వకపోతే తాము అధికారంలోకి రాగానే రూ. 4వేల పెన్షన్ ఇస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎండలో సచివాలయానికి వెళ్లడం వలన ఒకరిద్దరు చనిపోయారని.. ఇలాంటి సంఘటనలు జరగకుండా పెన్షన్‌లు ఇవ్వాలని కోరారు.. వైసీపీ నేతలు గొడ్డలితో ప్రజలను భయపెడ్తున్నారని.. ఫ్యాన్ గుర్తు తీసేసి గొడ్డలి గుర్తు పెట్టుకోవాలని జగన్‌కు సూచించారు. ఫ్యాన్‌ను ముక్కలు చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు స్పష్టం చేశారు. టీడీపీ-జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకున్న తరువాత అనపర్తిలో తన అభ్యర్థిగా శివకృష్ణంరాజును నిలబెట్టింది బీజేపీ. అయితే, బీజేపీ అనపర్తి ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేయడం కంటే.. రాజమహేంద్రవరం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తే ప్రయోజనం ఉంటుందనే టాక్ బాగా నడిచింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…