Chandra Babu : తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. స్కిల్ స్కాంలో హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు కాగా, ఈ నెల 29 నుంచి చంద్రబాబు ఇక ప్రజల్లోకి వచ్చేందుకు లైన్ క్లియర్ అయింది. ఇదే సమయంలో సీఐడీ తదుపరి అడుగుల పైన ఆసక్తి కొనసాగుతోంది. అటు సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటీషన్ పైన తీర్పు ఏంటనేది మరింత ఉత్కంఠ పెంచుతోంది. స్కిల్ కేసులో సెప్టెంబర్ 9న సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసారు. ఆ వెంటనే ఏసీబీ కోర్టు చంద్రబాబుకు రిమాండ్ విధించింది .
రాజమండ్రి జైలులోనే చంద్రబాబు 53 రోజులు ఉన్నారు. అనారోగ్య కారణాలతో చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయటంతో హైదరాబాద్ లో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కంటికి ఆపరేషన్ పూర్తయింది.అయితే మధ్యంతర బెయిల్ కండీషన్ల కారణంగా చంద్రబాబు రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన సమయంలోనే మధ్యంతర బెయిల్ కండీషన్ల కొనసాగింపు పైన స్పష్టత ఇచ్చింది. అదే సమయంలో కొన్ని కీలక సూచనలు చేసింది. ఈ నెల 29వ తేదీ వరకు చంద్రబాబు ర్యాలీలు..సభల్లో పాల్గొనవద్దని నిర్దేశించింది. 29వ తేద నుంచి యధావిధిగా రాజకీయ కార్యకలాపాలు కొనసాగించేందుకు ఎలాంటి అభ్యంతరం ఉండదు. ఈ నెల 30న చంద్రబాబును ఏసీబీ కోర్టులో హాజరు కావాలని కోర్టు సూచించింది.
అయితే చంద్రబాముకి తాజాగా బెయిల్ రావడంతో ప్రతి ఒక్కరు ఫుల్ ఖుష్ అవుతున్నారు. న్యాయం గెలిచింది అంటూ సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ ఒక్కొక్కళ్లకి గట్టిగా ఇచ్చిపడేసాడు. తను అరెస్ట్ అయినప్పుడు సంబరాలు చేసుకున్న రోజాకి రానున్న రోజులలో చుక్కలు చూపించబోతున్నట్టుగా చంద్రబాబు వ్యాఖ్యలు చేశాడు. చంద్రబాబుకు.. న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయటంపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. సత్యం గెలిచింది.. అసత్యంపై యుద్ధం మొదలవబోతోందని నారా లోకేష్ అభివర్మించారు. “సత్యమేవజయతే” అన్నది మరోసారి నిరూపితమైందన్నారు. ఆలస్యమైనా సత్యమే గెలిచిందని చెప్పుకొచ్చారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…