Chandra Babu : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ రెండు దఫాలుగా ముఖ్యమంత్రి అయ్యారు. మూడో సారి ముచ్చటగా ముఖ్యమంత్రి అవుతాడని భావించగా ఊహించిన నిరాశే ఎదురైంది. వరుసగా రెండుసార్లు అధికారం చేపట్టిన బీఆర్ఎస్ పార్టీ ఈసారి ప్రతిపక్ష పాత్రకే పరిమితం అయింది. బీఆర్ఎస్ పార్టీ 39 సీట్లకే పరిమితం అయింది. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు టీడీపీ నుంచి పరోక్షంగా మద్దతు లభించించింది. ఈ ఎన్నికల్లో టీడీపీ పోటీకి దూరంగా ఉండడం కూడా కాంగ్రెస్ కు కలిసొచ్చిందని ప్రచారం జరుగుతోంది. ఈ ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీకి ఓటమి పాలైన బీఆర్ఎస్ కు పోలైన ఓట్ల శాతంలో తేడా కేవలం 2.07.
రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్‌కి పోలైన ఓట్ల శాతం 1.40. ఈ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసి ఉంటే కచ్చితంగా 2-3 శాతం ఓట్లు చీల్చి ఉండేది. ఆ చీలిన ఓట్లు అధికార బీఆర్ఎస్ కు మరోసారి అధికారాన్ని కట్టబెట్టి ఉండేవి.అయితే, కొందరు మాత్రం సీమాంధ్రులు గ్రేటర్ పరిధిలోని సీమాంధ్రులు ఓటు వేయడానికి రాలేదని, అందుకే బీఆర్ఎస్ కు ఇక్కడ ఎక్కువ సీట్లు వచ్చాయని ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు గారి అరెస్ట్ నేపథ్యంలో ఆయన అభిమానుల పేరిట చేసిన హడావుడి బీఆర్ఎస్ ఓటుగా మారలేదని అంటున్నారు. మరోవైపు చంద్రబాబు సైతం తన సన్నిహితులతో ఇది నేనిచ్చిన రిటర్న్ గిఫ్ట్ అని చెప్పినట్టు ప్రచారం జరుగుతుంది.
రేవంత్ రెడ్డి గెలుపు తర్వాత ఆయన ఇంటి దగ్గర కాంగ్రెస్ జెండాలతో పాటు టీడీపీ జెండాలు కూడా రెపరెపలాడాయి. కాంగ్రెస్ గెలుపులో టీడీపీ హస్తం కూడా ఉందని కొందరు అంటున్నారు. అయితే చంద్రబాబు మాత్రం ఇప్పటి వరకు కాంగ్రెస్ గెలుపుపై ఎలాంటి కామెంట్స్ చేయలేదు. కేవలం కొందరు మంత్రులు మాత్రమే స్పందించారు తప్ప చంద్రబాబు మాత్రం ఇంకా ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు.