Chandra Babu Naidu : ప్రస్తుతం ఏపీలో పొలిటికల్ వార్ చాలా వాడి వేడిగా సాగిపోతుంది. వైఎస్ఆర్సీపీ నాయకులు, టీడీపీ నాయకులు, జనసేన నాయకలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ వార్తలలో నిలుస్తున్నారు. అయితే సమయం సందర్భం వచ్చినప్పుడు వైసీపీ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిప్పులు చెరుగుతూనే ఉంటారు. సర్కార్ అనుసరిస్తున్న విధానాలు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయని తన ఆక్రోశం తెలియజేస్తూనే ఉంటారు. రీసెంట్‌గా ఏర్పాటు చేసిన ఓ మీడియా సమావేశంలో వైసీపీ అనుసరిస్తున్న విధానాలను చంద్ర బాబు ఎండగట్టారు.
తమ ప్రభుత్వంలో రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని, 5.13 లక్షల మందికి ఉద్యోగాలిచ్చామని ఆయన అన్నారు. 2019 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రానికి కేవలం 5,751 కోట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయని చంద్రబాబు తెలియజేశారు. పెట్టుబడులు లేక రాష్ట్రంలో నిరుద్యోగం రేటు 6.15 కి పేరిగిపోయిందని కూడా అన్నారు. రజనీకాంత్ హైదరాబాద్, ఎన్టీఆర్ గురించి మాట్లాడితే తప్పేంటి? ఏపీకి వచ్చి స్వేచ్ఛగా మాట్లాడకూడదా? రజనీకాంత్ ఎక్కడా కూడా వైసీపీ గురించి కానీ, జగన్ గురించి కానీ ఒక్క మాటైనా మాట్లాడారా? అయినా ఆయన మీద ఎందుకు పడిపోతున్నారు? హైదరాబాద్ గురించి మన్మోహన్ సింగ్, బిల్ క్లింటన్ కూడా మాట్లాడారు, మేం చేసిన పనులను పొగిడారు.
పవన్ నేను కలిస్తే మీకు ఎందుకు భయం? కాపులతో పవన్‌ను తిట్టిస్తున్నారు. మమ్మళ్లీ చూసి ఉచ్చపోసుకుంటున్నారా? 45 ఏళ్ల ఇండస్ట్రీ నాది పొత్తుల గురించి ఎప్పుడు నిర్ణయం తీసుకోవాలో మీరు నాకు చెప్తారా? యువత ఇప్పటికైనా మేల్కోండి..లేదంటే జీవితం నాశనం అవుతుంది. జగన్ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఇప్పుడు చెప్పులు తీస్తున్నారు. ఇకపై బట్టలు విప్పుతారు అంటూ బాబు చాలా ఆవేశంగా మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడి నాలుగు సంవత్సరాలు అవుతోంది రాష్ట్రానికి ఏమీ చేయలేకపోయారు.ఇప్పుడేం చేస్తారు..? ఫైబర్ గ్రిడ్, స్కిల్ డెవలప్మెంట్, ఇన్సడైర్ ట్రేడింగ్ అన్నారు.. ఏం చేశారు? మేం చాలా క్లీన్‌గా క్లియర్‌గా ఉన్నాం.. మమ్మల్ని ఏం చేయలేరు అని వైసీపీ విధి విధానాలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…