Chandra Babu : గెలుపు త‌ర్వాత చంద్ర‌బాబు ఇంట్లో సంబ‌రాలు.. ఒక్కొక్క‌రి ముఖం ఎంత వెలిగిపోతుంది..!

Chandra Babu : ఎవ‌రు ఊహించ‌ని విధంగా ఈ సారి ఏపీ ఎన్నిక‌ల‌లో కూట‌మి భారీ విజ‌యం సాధించింది. ఈ పరిణామంతో వైసీపీ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఊహించనన్ని స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ సర్వే సంస్థల అంచనాలను తలకిందులు చేస్తూ నెంబర్ గేమ్‌లో పరుగులు పెడుతోంది. దీంతో చంద్రబాబు ఇంట సంబరాలు అంబరాన్నంటాయి. నారా చంద్రబాబు భువనేశ్వరీ దంపతులు హర్షం వ్యక్తంచేస్తూ.. కేక్ కట్ చేశారు. అంతేకాకుండా.. నారా లోకేష్, బ్రాహ్మణి, దేవాన్ష్ కూడా కేక్ ఒకరినొకరు తినిపించుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. కేక్ కట్ చేసిన చంద్రబాబు నాయుడి మనవడు దేవాన్ష్ అందరికీ తినిపించాడు. చంద్రబాబు కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఫొటోలు దిగారు.

వారిలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, యువనేత నారా లోకేశ్, ఆయన భార్య బ్రాహ్మణి, తదితరులు ఉన్నారు. కాగా, కాసేపట్లో చంద్రబాబు నాయుడి ఇంటికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెళ్లనున్నారు. కూటమి ప్రభుత్వ ఏర్పాటుపై టీడీపీ, బీజేపీ, జనసేన చర్చించనున్నాయి. కూటమి కట్టినప్పుడే సగం విజయం ఖాయమై పోయిందని అప్పుడే భావించాయి టీడీపీ, జనసేన, బీజేపీ. ఇప్పుడు వాళ్ల అంచనాలు అక్షరాలా నిజమవుతున్నాయి. కూటమి విజయకేతనం ఎగరవేస్తోంది. అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు అన్ని జిల్లాల్లోనూ సత్తా చాటుతోంది టీడీపీ కూటమి.

Chandra Babu naidu celebrated his victory in his house
Chandra Babu

చంద్రబాబు నాయుడిని బీజేపీ ఏపీ ఇన్‌చార్జ్ సిద్ధార్థ్ సింగ్ ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. తమ కూటమి విజయం సాధించడంతో చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబుకి మరికొందరు నేతలు కూడా శుభాకాంక్షలు చెప్పారు.పవన్ పిఠాపురంలో స్పష్టమైన మెజార్టీ అందరీ దృష్టిని ఆకర్షించింది. మొదట్ రౌండ్ నుంచే ఆయన అదిక్యం చూపించారు. సమీప ప్రత్యర్థి వంగా గీత పై భారీ మెజార్టీతో గెలుపొందారు. గెలుపుతో ప‌వన్ స‌తీమ‌ణి అన్నా లెజినోవా ఆయ‌నకి వీర‌తిల‌కం దిద్దారు. ఆ స‌మ‌యంలో ప‌వ‌న్ త‌న‌యుడు అకీరా నంద‌న్ కూడా ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే రాజధాని మార్పు వైసీపీకి గట్టిగా దెబ్బకొట్టినట్టు కనిపిస్తోంది. రాజధాని మారుస్తానని ప్రకటించడం తప్ప ఐదేళ్లుగా వైజాగ్‌కు చేసింది కూడా ఏమీ లేదు. ఇది టీడీపీ విజయానికి అనుకూలించిందనే టాక్ వినిపిస్తోంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago