Chandra Babu : ఒక్కోసారి పరిస్థితులు అన్నీ మార్చేస్తాయి అంటారు. చంద్రబాబు విషయంలో అదే జరుగుతోందా? ఇదివరకు ఎప్పుడూ లేనంతగా ఆయనలో భక్తి ప్రపత్తులు పెరిగిపోయాయా? ఎందుకిలా? ఆయన్ని ఏ ఘటన ఇలా మార్చేసింది? అనే అనుమానాలు అందరిలో తలెత్తుతున్నాయి. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరయింది. హైకోర్టుతో పాటు, సుప్రీంకోర్టు కూడా ఆయన రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడానికి అనుమతులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన మళ్లీ జనం లోకి రావాలని అనుకుంటూ ఉన్నారు.
డిసెంబర్ 10 నుంచి ఆయన జిల్లాల పర్యటనలు చేపట్టాలని నిర్ణయించారు. అంతకు ముందే చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి సీఈసీని కలవాలని భావిస్తున్నారు. ఏపీలో ఓట్ల అక్రమాలు జరుగుతున్నాయని సీఈసీకి ఫిర్యాదు చేసేందుకు ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆ తర్వాత పార్టీ కార్యకలాపాల్లో ఆయన బిజీగా ఉండనున్నారు. త్వరలోనే ఆయన పర్యటనలకు సంబంధించి టీడీపీ షెడ్యూల్ ను విడుదల చేయనుంది. అయిత ఏ రెండు రోజుల క్రితం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు శనివారం నాడు విజయవాడలోని కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. దుర్గమ్మ గుడికి ఆయన భార్యతో కలిసి వెళ్లారు. అమ్మవారిని దర్శించుకున్నాక బయట మీడియాతో మాట్లాడారు.
![Chandra Babu : దుర్గమ్మ సాక్షిగా పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు Chandra Babu interesting comments on pawan kalyan](http://3.0.182.119/wp-content/uploads/2023/12/chandra-babu-2.jpg)
తెలుగుజాతిని అగ్రస్థానంలో నిలబెట్టాలనేదే తన లక్ష్యమని, అందుకు ఎన్ని ఆటంకాలు ఎదురైనా, దుష్టశక్తులు అడ్డుకున్నా తన పయనం ఆగబోదని స్పష్టం చేశారు. మానవ సంకల్పానికి దైవం ఆశీస్సులు ఉండాలని, అందుకే తాను ఈ యాత్ర చేపట్టానని చెప్పారు. దుష్టుల నుంచి సమాజాన్ని రక్షించాలని శక్తి స్వరూపిణి కనకదుర్గమ్మను ప్రార్థించినట్లు చంద్రబాబు తెలిపారు. పవన్ కళ్యాణ్ తనకు ఇచ్చిన సపోర్ట్‌ని ఎప్పటికీ మరచిపోలేనని చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం చంద్రబాబు చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. దుర్గమ్మ ఆలాయినికి వచ్చిన చంద్రబాబుకు కేశినేని నాని, కేశినేని చిన్ని, జనసేన నేత పోతిన మహేష్, పంచుమర్తి అనురాధ, అశోక్ బాబు, దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, యార్లగడ్డ వెంకట్రావు, బోండా ఉమా, మాగంటి బాబు, బుద్దా వెంకన్న తదితరులు స్వాగతం పలికారు.