Chandra Babu : చంద్ర‌బాబుకి ఘ‌న స్వాగ‌తం పలికిన ప్ర‌జ‌లు.. కిక్కిరిసిన ఎయిర్‌పోర్ట్

Chandra Babu : టీడీపీ అధ‌నేత‌, మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడుని సెప్టెంబర్‌ 9వ తేదీన స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో వైసీపి ప్రభుత్వం అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. సెప్టెంబర్‌ 10 నుంచి సుమారు రెండు నెలలు జైలులో నిర్బందించి ఉంచడంతో, ఆయన గురించి వార్తాలే తప్ప ప్రజలకు కనబడలేదు. చంద్రబాబు నాయుడు కంటి ఆపరేషన్ కోసం అక్టోబర్ 31వ తేదీన నాలుగు వారాలకు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో కొన్ని గంటల సేపు మాత్రమే ఆయన ప్రజలకు కనబడ్డారు. కంటి ఆప‌రేష‌న్ కార‌ణంగా బ‌య‌ట‌కు రాలేదు. నవంబర్‌ 20వ తేదీన హైకోర్టు చంద్రబాబు నాయుడుకి రెగ్యులర్ బెయిల్‌ మంజూరు చేసింది. వైసీపి ప్రభుత్వం హైకోర్టు తీర్పుని సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్లింది కానీ అక్కడా దానికి ఎదురుదెబ్బ తగిలింది.

ఈ నెల 28వ తేదీ నుంచి ఆయన రాజకీయ సభలు, సమావేశాలకు హాజరయ్యేందుకు కూడా సుప్రీంకోర్టు అనుమతించడం వైసీపి ప్రభుత్వం జీర్ణించుకోవడం చాలా కష్టమే. చంద్రబాబునాయుడు తిరుమల శ్రీవారి దర్శనం నిమిత్తం నిన్న‌ సాయంత్రం రేణిగుంట చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి చంద్రబాబు ప్రత్యేక విమానంలో వచ్చారు. రేణిగుంట ఎయిర్ పోర్టు వద్ద చంద్రబాబుకు టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. టీడీపీ అధినేత రాకతో విమానాశ్రయం వద్ద భారీ కోలాహలం నెలకొంది.

Chandra Babu got big welcome at airport
Chandra Babu

టీడీపీ నేతలు, కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. చంద్రబాబు పార్టీ శ్రేణులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. చంద్రబాబు రోడ్డు మార్గం ద్వారా తిరుమల చేరుకున్న‌ట్టు తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో అరెస్ట్ కావడం, సుమారు రెండు నెలలు జైల్లో ఉండటం ఓ పీడకల వంటిది. కనుక టిడిపికి పట్టిన వైసీపి చీడపీడలన్నీ వదిలిపోవాలంటే దైవానుగ్రహం కూడా అవసరం. అందుకే చంద్రబాబు నాయుడు ప్రజల మద్యకు వచ్చే ముందు దైవదర్శనం చేసుకుంటున్నారు. మరో నాలుగైదు రోజులలో చంద్రబాబు నాయుడు ఇవన్నీ పూర్తిచేసుకొని ప్రజల మద్యకు వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ఎన్నికల శంఖారావం పూరించి వైసీపితో యుద్ధానికి టిడిపి శ్రేణులను, ప్రజలను సిద్దం చేయనున్నారు. చంద్రబాబు నాయుడుని చూసి దాదాపు మూడు నెలలు కావస్తోంది. కనుక ప్రజలు కూడా ఆయన కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

2 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

2 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

2 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 months ago