Chandra Babu : వైసీపీ నాయకుడు జగన్‌పై పోరాడేందుకు చంద్రబాబు- పవన్ కళ్యాణ్ ఎత్తులు వేస్తున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో భాగంగా చంద్రబాబు అరెస్ట్ అయి ఇటీవల మధ్యంతర బెయిల్‌తో బయటకు వచ్చిన విషయం తెలిసిందే. నవంబర్ 4 మధ్యాహ్నం పవన్ కళ్యాణ్.. నాదెండ్ల మనోహర్‌తో కలిసి జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసానికి వచ్చారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. తన అరెస్టు సందర్భంగా పార్టీకి, కుటుంబసభ్యులకు అండగా నిలిచినందుకు పవన్ కళ్యాణ్‌కు చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య తాజా రాజకీయ పరిణామాల గురించి చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
అయితే టీడీపీ – జనసేన కలిస్తే ఏ రాజకీయ శక్తికి కూడా వారిని ఓడించే సత్తా లేదని, ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే సత్తా టీడీపీ – జనసేన కూటమికి ఉందని రాజకీయ విశ్లేషకులు సైతం చెప్పే మాట.ముఖ్యంగా కోస్తాంధ్ర ప్రాంతం లో కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని, వైసీపీ పార్టీ కి ఒక్కటంటే ఒక్క స్థానం కూడా వచ్చే అవకాశం లేదని సర్వేలు చెప్పుకొస్తున్నాయి.అన్నీ లెక్కలు సరిగ్గా కలిసి వస్తే టీడీపీ – జనసేన కూటమి 160 స్థానాల్లో గెలుస్తుందని నారా లోకేష్ మీడియా తో చెప్పిన మాటలు బాగా వైరల్ అయ్యాయి. ఇక రీసెంట్‌గా పవన్ చంద్రబాబుతో జరిగిన చర్చలలో పొత్తు గురించి సీట్ల సర్దుబాటు గురించి సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తుంది.పొత్తులో భాగంగా జనసేన పార్టీ కి 50 స్థానాలు ఇవ్వడానికి తెలుగు దేశం పార్టీ ఒప్పుకుంది.
ఇద్దరు చర్చలు జరిపిన తర్వాత చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ నాయకులపై పంచ్‌లు వేసారు. జగన్ ఏమన్నా గొప్ప నాయకుడా, వాళ్లు నన్ను వేధించారో మీరు చూశారు. వారి క్యారెక్టర్ ఏమైన గొప్పగా ఉందా. ప్రజాస్వామ్యం, న్యాయ పోరాటం చేసి ఈ సారి ఏపీ నుండి వారిని తరిమిగొట్టాలని చంద్రబాబు అన్నారు. దీనికి అందరి మద్దతు కూడా కావాలని అన్నారు. ప్రస్తుతం చంద్రబాబుకి సంబంధించిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి.