Chandra Babu : వాలంటీర్ల తీరుతో పెను ప్రమాదం పొంచి ఉందని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకి మద్దతుగా నిలిచారు చంద్రబాబు నాయుడు. వాలంటీర్లు వ్యక్తిగత సమాచారం సేకరించడం ద్రోహమన్నారు. వలంటీర్లు పౌరసేవకు పరిమితం కాకుండా రాజకీయ జోక్యం చేసుకుంటే కుదరదని ఆయన అన్నారు.. వ్యక్తిగత సమాచార సేకరణ వల్ల చాలా ప్రమాదం పొంచి ఉందన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే ప్రజా సేవ వరకే వలంటీర్ల సేవలను పరిశీలిస్తామన్నారు. వాలంటీర్ల వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేస్తున్న విమర్శలు దుమారం రేపుతుండగా, ఇప్పుడు చంద్రబాబు చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాలలో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి.
వలంటీర్స్ వ్యక్తిగత సమాచారం సేకరించడం ద్రోహమన్నారు. వలంటీర్లు పౌరసేవకు పరిమితం కాకుండా రాజకీయ జోక్యం చేసుకుంటే కుదరదన్నారు. వ్యక్తిగత సమాచార సేకరణ వల్ల చాలా ప్రమాదం పొంచి ఉందన్నారు. ఇంత అవినీతి చేయమని జగన్మోహన్ రెడ్డికి ఏసుప్రభువు ఏమైనా చెప్పాడా ? లక్షల కోట్ల ప్రజా సంపద నాశనం చేసి, లక్షల కోట్లు అప్పు చేయమని ఖురాన్ చెప్పిందా? అధికారంలో ఉండగా నేనేం చేశానో ప్రజలు చూశారు. గత నాలుగేళ్లుగా జగన్ ఏం చేస్తున్నాడో కూడా బేరీజు వేసుకున్నారు.. చెప్పుతో కొట్టేవాడు లేక జగన్ ఇలాంటి పనులు చేస్తున్నాడని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రుషికొండపై జగన్మోహన్ రెడ్డి కట్టుకునే విలాసవంతమైన భవనం కోసం దేశ విదేశాల నుంచి ఫర్నిచర్ తెప్పిస్తున్నారట. పవర్ రిఫార్మ్స్ వల్ల 2004లో నా పవర్ పోయినా రాష్ట్రం బాగుపడింది. ఇతర రాష్ట్రాలకు తక్కువ ధరకు విద్యుత్ పంపిణీ చేసే సంస్కరణలు తీసుకొస్తాం. ఏపీలో అమలయ్యే విద్యుత్ విధానం దేశానికే ఆదర్శంగా నిలిచే చర్యలు చేపడతాం. ఇప్పుడు హైదరాబాద్ కి వెళ్తే నాకు ఓట్లు పడకపోవచ్చు…, ఈ తరం వారికి చేసిన కృషి తెలియకపోవచ్చు కానీ నేను అభివృద్ధి చేశాననే సంతృప్తి మాత్రం నాకుంది అని చంద్రబాబు అన్నారు. వాలంటీర్ వ్యవస్థపై జనసేన చీఫ్ చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు సమర్థించినట్లయింది.