Chalaki Chanti : చలాకీ చంటి.. ఈ కమెడీయన్ జబర్ధస్త్ షోతో ఎంతగా అలరించాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన శైలిలో కామెడీ పండిస్తూ అలరించాడు. ఈ క్రేజ్ తోనే చలాకీ చంటి బిగ్ బాస్ షోలోకి అడుగుపెట్టాడు. అయితే ఎవరు ఊహించరు విధంగా చంటి 5వ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వడం సంచలనంగా మారింది . దీనికి మెయిన్ రీజన్ ఆయన హౌస్ లో అందరితో కలిసి ఉండటమే అంటున్నారు జనాలు. హౌజ్‌లో ఉండాలంటే కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రెస్ లా ఉండాలి. ఎప్పుడూ నెగిటివ్ కామెంట్స్ చేస్తూ స్పైసీ కంటెంట్ ఇవ్వాలి. వయసులో ఉన్నోళ్లయితే ఎఫైర్ పెట్టుకోవాలి. బిగ్ బాస్ గేమ్ కి కావలసిన ఒక్క లక్షణం కూడా చంటిలో లేకపోవడంతో తొందరగా బయటకు వచ్చేశాడు.
ఎలిమినేషన్ కి నామినేటైన 8 మందిలో చంటికే ఎక్కువ పాపులారిటీ ఉంది. కాని ఏవో కారణాలు చెప్పి అతడిని ఎలిమినేట్ చేశారు. దాంతో చంటి బిగ్ బాస్ షో ప్రయాణం ముగిసింది. కాగా ఐదు వారాలు హౌస్లో ఉన్నందుకు చంటి ఎంత తీసుకున్నారనే విషయంలో ఓ ఫిగర్ చక్కర్లు కొడుతుంది. చంటి వారానికి రూ.1.5 నుండి 2 లక్షల ఒప్పందంపై హౌస్లోకి వచ్చాడట. ఆ విధంగా చంటి ఐదు వారాలకు రూ. 7.5 నుండి 10 లక్షలు పారితోషికంగా అందుకున్నాడట.
సినిమాలు, షోలతో బిజీగా ఉన్న చంటికి ఇంత మొత్తంలో ఇవ్వడానికి నిర్వాహకులు ఏ మాత్రం వెనకడాలేదట. అందుకు కారణం అతనికి ఉన్న పాపులారిటీ. ఇక షోలో ఉన్న సమయంలో ఇంటి సభ్యులందరూ కూర్చొని తమ జీవితాల్లోని విషాద సంఘటనల గురించి పంచుకోగా, చలాకీ చంటి కి కూడా తన జీవితంలో జరిగిన విషాదాన్ని అందరితో పంచుకున్నారు. నాకు ఆడవాళ్లు అంటే అసలు పడదు. నేను ఎవరికీ దగ్గర కాను ఎవరిని అభిమానించను. నేను దగ్గర అయితే వాళ్ళు నాకు దూరం అవుతారని అనిపిస్తుంది. అది నా సెంటిమెంట్ చిన్నప్పుడే నాన్న చనిపోయారు. ఊహ తెలిశాక అమ్మ నా కళ్ల ముందే కాలిపోయింది. నేను చూస్తుండగానే మా అమ్మ మంటల్లో కాలిపోయింది. ఆ తర్వాత అన్నయ్య, నేను ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాం అన్నాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…