JD Laxmi Narayana : సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజకీయంగా చాలా యాక్టివ్‌గా ఉన్నారు. లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ తర్వాత సివిల్ సర్వీసెస్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రియశీ లకంగా వినిపించిన పేరు జెడి లక్ష్మీనారాయణ .ముఖ్యంగా ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ అవినీతి కేసులలో సిబిఐ జెడి గా ఈయన పేరు రాష్ట్రవ్యాప్తంగా సంచలనగా మారింది . ఆ తర్వాత అనేక సమీకరణాలతో అతికీలకమైన ప్రభుత్వ పదవిని వదిలేసి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. రాజకీయాల దిశ మార్చాలని ఆయన పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. 2019లో జనసేన నుండి పోటీ చేశారు. కీలకమైన స్తాయిలోనే ఓట్లను దక్కించుకోగలిగినప్పటికీ చివరికి విజేతగా నిలవలేకపోవడంతో నిలవలేకపోయారు.
తర్వాత జరిగిన అనేక పరిణామాలతో జనసేన పార్టీకి దూరమైన ఈయన తన రాజకీయ భవిష్యత్తు కోసం సరైన పార్టీ కోసం అన్వేషించారు.దేశ రాజకీయాల్లోకి లేటెస్ట్ గా ఎంటర్ అయిన బారాసాలో చేరడానికి ఆయన ప్రయత్నించినప్పటికీ కాలం కలిసి రాకపోవడంతో ఆంధ్రప్రదేశ్ లో బారాస వెనకడుగు వేయటంతో ఈయనకు సరైన అవకాశం దక్కలేదు.దానితో ఇప్పుడు ఒంటరి పోరే శరణ్యమని భావిస్తున్న జెడి భావిస్తున్నట్టు సమాచారం. అయితే ఆయన వైసీపీలోకి చేరబోతున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఖండించారు. వైసీపీలోకి చేరితే జగన్‌కి చాలా కలిసి వస్తుందని అనగా, తాను అలాంటి నిర్ణయం ఏమి తీసుకోలేదని అన్నారు.
ఈ సారి తాను విశాఖ నుండే పోటీ చేస్తానని అంటున్నారు. గతంలో ఓడించిన ఇప్పుడు తనని గెలిపించుకునేందుకు వారు ఆసక్తిగా ఉన్నారని చెప్పుకొచ్చారు. అగ్రికల్చర్, రూరల్ డెవలప్‌మెంట్, ఎంప్లాయిమెంట్ విషయంలో హామీ ఇస్తే వారికి తప్పగా నా సపోర్ట్ అందిస్తానని జేడీ అన్నారు. అయితే జేడీ ఏ పార్టీ తరపున పోటీ చేస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.