CBI Ex JD Lakshmi Narayana : ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత మంత్రులకు శాఖలు కేటాయించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్‌మెంట్ అండ్ రూరల్ వాటర్ సప్లై, ఇన్విరాన్‌మెంట్, పారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, నారా లోకేశ్‌కి హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్, ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజీ శాఖలను కేటాయించారు. అయితే ఈ ప్రకటనకి ముందు పవన్ కళ్యాణ్‌కి ఏ పదవి ఇస్తే బాగుంటుందని చాలా చర్చలు జరిగాయి. దీనిపై ఎవరికి వారు తగు సూచనలు చేశారు. తాజాగా జేడి లక్ష్మీనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పవన్ కళ్యాణ్ భావాజాలం తెలిసిన వ్యక్తిగా నేను చెప్పింది ఏంటంటే మినిస్ట్రి ఆప్ ఎంప్లాయిమెంట్. ఆయనకి యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. వారికి ఉన్న శక్తితో ప్రతి మినిస్ట్రితో మాట్లాడి ఉద్యోగాలు ఎలా కేంద్రీకృతం చేయాలి అని ఆలోచిస్తే రాష్ట్రంలోని యువత మరింత వృద్ధి చెందుతారు. ఆయన చెబితే యువతలోకి కూడా బాగా వెళుతుంది. యువతరానికి ఆయన ఏం చెప్పిన మంచిగా వెళ్లే అవకాశం ఉంది. ఇదొక కొత్త ప్రయోగం అని జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. వారు ఏ శాఖలో ఉన్నా కూడా ఆ మంత్రిత్వ వాఖని ముందుకు తీసుకెళతారని నేను అనుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు జేడీ.
![CBI Ex JD Lakshmi Narayana : పవన్ భావాలు తెలిసిన వాడిగా చెబుతున్నా.. ఆ శాఖ బాధ్యతలు ఇస్తే బాగుంటుందన్న జేడీ CBI Ex JD Lakshmi Narayana interesting comments on pawan kalyan](http://3.0.182.119/wp-content/uploads/2024/06/cbi-ex-jd-lakshmi-narayana.jpg)
సీబీఐ మాజీ జేడీ, జనసేన విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ విధానాల్లో నిలకడ లేదని.. అందుకే తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. రాజకీయాలకే సమయం వెచ్చిస్తానని చెప్పిన పవన్.. సినిమాల్లో నటించడం నచ్చకే తప్పుకుంటున్నట్లు ఆయన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఈ విషయంపై జనసేనాని పవన్ కళ్యాణ్ అదిరిపోయే రిప్లై ఇచ్చారు.జేడీ లక్ష్మీనారాయణ భావాలను గౌరవిస్తున్నామన్న పవన్.. రాజీనామాను ఆమోదిస్తున్నట్లు తెలిపారు. పార్టీని నడిపేందుకు తనకు ఫ్యాక్టరీలు, వ్యాపారాలు, గనులు లేవని.. సినిమాలే తనకు ఉన్న ప్రత్యామ్నాయమని ఆయన తేల్చి చెప్పారు. అవన్నీ తెలుసుకుని ఉంటే బాగుండేదంటూ కాస్త ఘాటుగానే సమాధానమిచ్చారు పవన్ కళ్యాణ్.