RCB : ఐపీఎల్ 2024 చాలా హోరాహోరీగా సాగుతుంది. ఈ సారి ప్రతి జట్టు కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తుంది. అయితే ముంబై, ఆర్సీబీ లాంటి జట్లు మాత్రం చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరచకపోవడం ఫ్యాన్స్‌ని నిరుత్సాహపరుస్తుంది. అయితే ప్రతి సీజన్‌లో ఆర్సీబీ జట్టు బలంగా ఉన్నప్పటికీ ఎందుకో ఆ జట్టు చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరచదు.ఈ సారి కూడా ఆ జట్టుకు ప్లే ఆఫ్ ఆశలు గల్లంతైనట్లే. ఈ సీజన్ లో ఆర్సీబీ మొత్తం ఏడు మ్యాచ్ లు ఆడగా.. కేవలం ఒక్క మ్యాచ్ లోనే విజయం సాధించింది. మిగిలిన మ్యాచ్ లలో ఆ జట్టు ఓడిపోయింది. దీంతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. వరుస ఓటములతో సతమతమవుతున్న ఆర్సీబీ జట్టునుండి ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ తాత్కాలికంగా వైదొలుగుతున్నాడు.
ఇప్పటికే ఈ విషయాన్ని అతను ఆర్సీబీ జట్టు కెప్టెన్ డు ప్లెసిస్, కోచ్ కు చెప్పాడు. హైదరాబాద్ మ్యాచ్ కంటే ముందే ఈ విషయాన్ని మాక్స్‌వెల్ వారికి చెప్పడంతో అతని స్థానంలో హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో విల్ జాక్స్ ను తుది జట్టులో చేరారు. ఇక ఆరు ఓటములను మూటగట్టుకొని పాయింట్ల పట్టికలో చిట్టచివరన నిలిచిన ఆర్సీబీ జట్టు నెట్ రన్ రేటు మైనస్ 1.185గా ఉంది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మిగిలివున్న అన్ని మ్యాచ్‌ల్లో గెలిస్తేనే ఆ జట్టుకు ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉంటాయి. అది కూడా ఇతర టీమ్‌లపైన ఆధారపడి ఉంటుంది. అద్భుతం జరిగితేనే ఆర్సబీ ప్లేఆఫ్‌కి చేరుతుంంది. లేదంటే ఆశలు వదులుకోవాల్సిందేనని క్రికెట్ నిపుణులు చెబుతున్నారు.
ఇక జట్టుకి మెయిన్ పిల్లర్‌గా ఉన్న మ్యాక్స్‌వెల్ ఇటీవల వరుస మ్యాచ్‌లలో నిరాశపరచడం వారికి పెద్ద దెబ్బ అయింది. సోమవారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఘోర పరాజయం తర్వాత మాక్స్‌వెల్ మీడియాతో మాట్లాడాడు. కొంతకాలంగా ఫామ్ కోల్పోయాను.. పవర్ ప్లే తర్వాత మా జట్టు వైఫల్యాలు ఎదుక్కొంటుంది.. బ్యాట్ తో నా ఆటతీరు ఆశించిన స్థాయిలో లేదు. మానసికంగా, శారీరకంగా విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చింది. అప్పుడే నేను ఫిట్ గా తిరిగొస్తా. నేను కేవలం తాత్కాలికంగానే టోర్నీకి దూరమవుతున్నా.. టోర్నీలో ఆర్సీబీ జట్టుకు నా అవసరం ఎప్పుడొచ్చినా బలంగా తిరిగొస్తానని మాక్స్‌వెల్ చెప్పాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…