Brother Anil Kumar : ఇక ఏపీలో ఇప్పుడు సినిమా స్టార్ట్ అయింది.. బ్ర‌ద‌ర్ అనీల్ కామెంట్స్..

Brother Anil Kumar : మ‌రి కొద్ది నెల‌ల్లో ఏపీలో ఎన్నిక‌లు షురూ కాబోతున్నాయి. ఈ సారి ఎలాగైన వైసీపీని ఓడించాని టీడీపీ, జ‌న‌సేన కంక‌ణం క‌ట్టుకోగా,బీజేపీ కూడా అందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. ఇక ఇదే స‌మయంలో జ‌గ‌న్‌కి ధీటుగా ఆయ‌న సోద‌రి ష‌ర్మిల‌ని బ‌రిలోకి దింపే ప్ర‌య‌త్నం చేస్తుంది కాంగ్రెస్. ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల వేళ అధికార వైసిపికి వైఎస్ షర్మిల పెద్ద తలనొప్పిలా మారారు. సొంత సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కాదని కాంగ్రెస్ పార్టీలో చేరారు వైఎస్ షర్మిల. ఇక ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్ పులివెందులలో జగన్ ప్రత్యర్థి, టిడిపి నేత బిటెక్ రవితో భేటీ అయ్యారు. ఇలా షర్మిల, అనిల్ దంపతులు వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీని వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో షర్మిల తన పార్టీని హస్తం పార్టీలో కలిపేశారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకొని పార్టీలో చేరారు. ప్రధాని వేదికపై ఖర్గే, రాహుల్‌తో పాటు వైఎస్ షర్మిల, ఆమె భర్త బ్రదర్ అనిల్, కేసీ వేణుగోపాల్ తదిత‌రులు ఉన్నారు. షర్మిల తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితాంతం కాంగ్రెస్ కోసం పనిచేశారన్నారు. అలాంటి పార్టీలో చేరటం పట్ల సంతోషంగా ఉందని అన్నారు. దేశంలోని అన్ని వర్గాలను ఒక్కటిగా నిలిపే శక్తి కాంగ్రెస్ పార్టీకే ఉందని అభిప్రాయపడ్డారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలన్నదే తన తండ్రి కోరికన్న షర్మిల.. పార్టీ ఏ పనిచేయమన్నా తాను సిద్ధమని స్పష్టం చేశారు. అండమాన్‌లో పనిచేయమన్నా చేస్తానని అన్నారు.

Brother Anil Kumar sensational comments on cm ys jagan
Brother Anil Kumar

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ సమర్థించారు. షర్మిల పక్కనే ఆయన వేదికపై ఉన్నారు. బ్రదర్ అనిల్ మీడియాతో మాట్లాడుతూ… కాంగ్రెస్ కుటుంబంలో తాము కూడా సభ్యులమే అని.. ఈ దేశానికి మంచి జరుగుతుందని అన్నారు. పార్టీ హైకమాండ్ ఏ బాధ్యతలను అప్పగించినా షర్మిల స్వీకరిస్తారని, కాంగ్రెస్ కుటుంబంలో ఉండటమే తమకు ముఖ్యమని చెప్పారు. ఏపీలో కచ్చితంగా షర్మిల ప్రభావం ఉంటుందని అన్నారు. ఇక సీఎం జగన్ కు వ్యతిరేకంగా పని చేయమని హైకమాండ్ ఆదేశిస్తే పరిస్థితి ఏమిటని ప్రశ్నించగా… అధిష్ఠానం ఆదేశాల మేరకు షర్మిల పూర్తి స్థాయిలో పని చేస్తారని చెప్పారు.మరోవైపు జగన్ గురించి బ్రదర్ అనిల్ కీలక వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి.. షర్మిలను, తనను దూరం పెడుతూ వచ్చారని ఆయన అన్నట్లు తెలుస్తోంది. ఇక ఏపీ రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని షర్మిలకు ఆసక్తే లేదని.. విధిలేని పరిస్థితులు కల్పించడంతో ఇలా రావాల్సి వచ్చిందని అనిల్ వ్యాఖ్యానించినట్లు సమాచారం.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago