పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. జూలై 28న థియేటర్లలో రిలీజ్ అయిన సినిమా రూ.110కోట్లకుపైగా కలెక్షన్లను సాధించింది. పవర్ స్టార్ అభిమానులకు బ్రో మూవీ తెగ నచ్చేసింది. వింటేజ్ పవన్‍ను చూసి సంతోషించారు. కాగా, బ్రో సినిమా ఇటీవలే ఓటీటీలోకి రాగా, . ఆగస్టు 25వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ప్లాట్‍ఫామ్‍లోసందడి చేస్తుంది. ఇప్పుడు ఓటీటీలోనూ ఈ చిత్రం దూసుకుపోతోంది. తాజాగా బ్రో మూవీ ఓటీటీలో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఈ సినిమాను ఓటీటీ వేదికగా ప్రేక్షకులను విపరీతంగా చూస్తున్నారు. దాంతో నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో నేషనల్ వైడ్ గా ఈ సినిమా నంబర్ వన్ స్థానంలోనిలిచింది.
ఓటీటీలో బ్రో సినిమా నయా రికార్డ్ క్రియేట్ చేయడంతో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ అభిమానులు తెగ ఖుష్ అవుతున్నారు. బ్రో సినిమా ఓటీటీలో తెలుగు, తమిళ్, కన్నడ , హిందీ , మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. బ్రో సినిమాకు నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో నేషనల్ వైడ్‍గా ఆదరణ భారీగా లభిస్తోంది. దీంతో ఇండియాలో టాప్ ట్రెండింగ్ మూవీల జాబితాలో ఈ సినిమా ప్రస్తుతం అగ్రస్థానంలోకి వచ్చింది. నెట్‍ఫ్లిక్స్‌లో నేషనల్ వైడ్‍గా ప్రస్తుతం టాప్ ట్రెండింగ్ మూవీగా బ్రో ఉంది. బ్రో చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహించారు. తాను తమిళంలో తెరక్కించిన వినోదయ సిత్తంకు రీమేక్‍గా తెలుగులోనూ ఆయనే బ్రో సినిమాకు దర్శకత్వం వహించారు. మాతృకకు కొన్ని మార్పులు చేసిన పవన్ కల్యాణ్‍కు తగ్గట్టుగా తీర్చిదిద్దారు. బ్రో చిత్రానికి థమన్ సంగీతం అందించారు.
బ్రో సినిమాలో దేవుడి (టైమ్ ఆఫ్ గాడ్) పాత్రలో పవన్ కల్యాణ్ నటించగా, ఆయన వింటేజ్ గెటప్స్ ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‍గా నిలిచాయి. సాయి ధరమ్ తేజ్ సరసన ఈ మూవీలో కేతిక శర్మ నటించారు. ప్రముఖ దర్శకుడు తివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు డైలాగ్స్ అందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల ఈ సినిమా నిర్మించారు. రోహిణి, ప్రియాప్రకాశ్ వారియర్, సుబ్బరాజు, వెన్నెల కిశోర్ కీలకపాత్రలు పోషించారు.