మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో వంకాయలు కూడా ఒకటి. ఇతర కూరగాయలలాగా వంకాయలు కూడా పోషకాలను కలిగి ఉంటాయి. వంకాయలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం పలు రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. వంకాయలతో మనం వివిధ రకాల వంటలను తయారు చేస్తూ ఉంటాం. వంకాయలతో మనం ఎంతో రుచిగా ఉండే వేపుడును కూడా తయారు చేసుకోవచ్చు. వంకాయ వేపుడు తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. ఈ వేపుడును ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వంకాయ వేపుడు తయారీకి కావల్సిన పదార్థాలు..
లేత వంకాయలు – పావు కిలో, తరిగిన పచ్చి మిర్చి – 2, ఆమ్ చూర్ పొడి – ఒక టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, సోంపు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, తరిగిన టమాట – 1 ( పెద్దది), అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, గరం మసాలా – అర టీ స్పూన్, నూనె – 100 గ్రా., తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
వంకాయ వేపుడు తయారీ విధానం..
ముందుగా వంకాయలను తీసుకుని నాలుగు ముక్కలుగా కోసి ఉప్పు కలిపిన నీటిలో వేయాలి. తరువాత ఒక కళాయిలో నూను వేసి నూనె వేడయ్యాక జీలకర్ర, పచ్చి మిర్చి వేసి వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత పసుపు, కారం, ఆమ్ చూర్ పొడి, సోంపు, జీలకర్ర పొడి వేసి కలుపుతూ ఒక నిమిషం పాటు వేయించాలి. తరువాత టమాట ముక్కలను వేసి కలిపి మూత పెట్టి టమాట ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి.
టమాట ముక్కలు ఉడికిన తరువాత వంకాయ ముక్కలను, తగినంత ఉప్పును వేసి మూత పెట్టి వంకాయలను పూర్తిగా ఉడికించుకోవాలి. వంకాయలు మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. వంకాయ ముక్కలు ఉడికిన తరువాత గరంమసాలాను వేసి కలిపి ఒక నిమిషం పాటు వేయించాలి. చివరగా కొత్తిమీరను చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వంకాయవేపుడు తయారవుతుంది. ఇలా చేసుకున్న వంకాయ వేపుడును అన్నం లేదా చపాతీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…