ఇటీవల వైసీపీ నేతలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై తెగ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా మెగా ఫ్యామిలీనే టార్గెట్ చేసింది.. మెగాస్టార్ చిరంజీవి , నాగబాబును కూడా కలుపుకుని విమర్శలు చేస్తున్నారు. జనసేన పార్టీ నుంచి నాగబాబు కూడా యాక్టివ్‌గా ఉండటంతో వీరిమధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇండస్ట్రీలోని చిన్న చిన్న ఆర్టిస్టులు మెగా ఫ్యామిలీని చూసి భయపడుతున్నారని , మెగా ఫ్యామిలీపై వారికి ప్రేమ లేదని.. భయం మాత్రమే ఉందని అన్నారు. అయితే హైపర్ ఆది లాంటి వారు తనపై చేస్తున్న వ్యాఖ్యలను ఉద్దేశించి రోజా ఇలా స్పందించారు.
తాజాగా ఇదే విషయం మీద క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీ ఆసక్తికరంగా రోజాకి కౌంటర్ ఇచ్చారు. నన్ను ఎప్పుడూ మెగా ఫ్యామిలీ క్యాంపెయిన్ చేయమని కానీ పార్టీలో చేరమని కానీ అడగలేదు, అయినా చిన్న ఆర్టిస్టులే కదా.. అంత భయపడతారు ఎందుకు అంటూ రోజాకు కౌంటర్ ఇవ్వడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కాగా, ‘మీ నుంచి ఈ రియాక్షన్ ఊహించలేదన్నా.. సినిమా ఇండస్ట్రీ నుంచి స్పందించిన మొదటి వ్యక్తివి నువ్వు.. థ్యాంక్యూ’ అంటూ మెగాభిమానులు, జనసేన అభిమానులు బ్రహ్మాజీ ట్వీట్‌ను రీ ట్వీట్స్ చేస్తున్నారు.
కాగా, రోజా ఏం మాట్లాడిందంటే.. వాళ్లెంత.. వాళ్ల ప్రాణమెంత. వాళ్లు మాట్లాడుతున్నారు అంటే.. వాళ్లతో ఎవరు మాట్లాడిస్తున్నారు అనేది మనం ఆలోచించాలి. వాళ్లను మనం అనడం వేస్ట్. వాళ్లేదో చిన్న చిన్న షోలు చేసుకుంటారు.. చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటారు. మెగా ఫ్యామిలీలో ఆరేడు మంది హీరోలు ఉన్నారు కాబట్టి వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడితే సినిమా ఇండస్ట్రీలో ఏమీ లేకుండా చేస్తారనే భయంతో ఆ కుటుంబంతో ఉన్నారు తప్ప ప్రేమతో ఎవ్వరూ లేరు. నిజంగా ప్రేమ ఉంటే వాళ్లు ప్రకాష్ రాజ్‌కు సపోర్ట్ చేసినప్పుడు మా అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా ఎందుకు గెలవలేదు. ఒక్కసారి ఆలోచించండి. ప్రేమ వేరే భయం వేరే అని కొంచెం ఘాటు వ్యాఖ్యలే చేసింది రోజా.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…