Biyyapu Madhusudan Reddy : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఇటీవల ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విజయోత్సవ సభ యుగళం నవశకం కొనసాగుతోంది. విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని పోలిపల్లిలో జరిగిన సభకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, నందమూరి బాలయ్య, నారా లోకేష్‌లు ఒకే వేదికపైకి వచ్చి సందడి చేశారు. ఈ సభకు టీటీడీ, జనసేన పార్టీల నేతలు, కార్యకర్తలు భారీగా తరలిరావడంతో సందడి వాతావరణం నెలకొంది. అయితే ఈ సభలో లోకేష్ తన రెడ్ డైరీని చంద్రబాబుకి అందించగా, దానిపై బియ్యపు మధుసూధన్ రెడ్డి నాన్‌స్టాప్ పంచ్‌లు వేశారు.
ఏపీలో జగన్ రెడ్డి పాలన అద్భుతంగా ఉందని, పిల్లలకి ట్యాబ్‌లు అందించి వారికి ఉన్నత విద్య అందేలా చేస్తున్నారు. అంతేకాదు జగన్ ప్రభుత్వంలో చాలా మంది విదేశాలకి వెళ్లారని, ఆయననే మరోసారి ముఖ్యమంత్రిగా కావాలని వారు కోరుకుంటున్నారంటూ కామెంట్ చేశారు. ఇక లోకేష్ రెడ్ డైరీ గురించి ప్రస్తావించగా, అందులో ఏముంటుంది.. పిల్లకాయలకి ఇస్తే ఏం రాస్తారు బొమ్మలు గీస్తారు, చాక్లెట్ పేర్లు రాస్తారు అని అన్నాడు. కాళహస్తికి వస్తే పాలకోవ ఫేమస్, తిరుపతికి వస్తే లడ్డు ఫేమస్, కుప్పంలో బజ్జీ ఫేమస్, ఈస్ట్, వెస్ట్‌కి పోతే పూతరేకులు ఫేమస్, నాయుడుపేటకి పోతే అరటి బజ్జీలు ఫేమస్ అని రాసుకున్నాడు.ఇది వాళ్ల నాయన చూసి ఏం రాసావు రా అని తిట్టాడంటూ పంచ్‌లు వేశాడు.
![Biyyapu Madhusudan Reddy : లోకేష్ డైరీపై బియ్యపు మధుసూధన్ రెడ్డి నాన్‌స్టాప్ పంచ్‌లు.. పక్కన ఉన్నవాళ్లు తెగ నవ్వేశారుగా..! Biyyapu Madhusudan Reddy strong counter to nara lokesh](http://3.0.182.119/wp-content/uploads/2023/12/biyyapu-madhusudan-reddy.jpg)
ఆ మధ్య టీడీపీ ఎమ్మెల్యేతో పాటూ నందమూరి బాలకృష్ణపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి బాలకృష్ణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీడీపీ సభ్యులను మానసిక ఆస్పత్రికి తరలించాలని.. అసెంబ్లీలో ఇలాంటి ప్రవర్తన సరికాదన్నారు. కాలేజీలో అమ్మాయిలను చూసి విజిల్స్ వేస్తున్నట్లు టీడీపీ నేతల ప్రవర్తన ఉందని ఎద్దేవా చేశారు.బాలకృష్ణకు మెంటల్.. సభకు రానివ్వొద్దు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సీట్లో ఇవాళ బాలకృష్ణ కూర్చున్నారని.. ఇవాళ పైనుంచి ఎన్టీఆర్ అసెంబ్లీని చూసి సంతోషపడి ఉంటారన్నారు. మెంటల్ సమస్య ఉన్న బాలకృష్ణను సభలోకి రానివ్వొద్దు అంటూ విరుచుకుపడ్డారు.