Bitter Gourd Leaves : మనం ఆహారంగా తీసుకునే కూరగాయలలో కాకరకాయ కూడా ఒకటి. ఇది చేదుగా ఉంటుందని మనందరికీ తెలుసు. దీనిని తినడానికి చాలా మంది ఇష్టపడరు. కానీ కాకరకాయను ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. ఇక కాకరకాయల లాగా కాకర ఆకులు కూడా మనకు మేలు చేస్తాయని చాలా మందికి తెలియదు. కాకరకాయల లాగా కాకర ఆకులు కూడా చేదుగా ఉంటాయి. ఈ ఆకులు ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. కాకరకాయల కంటే కాకర ఆకులే అధిక పోషకాలను కలిగి ఉంటాయి. ఈ ఆకులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మనకు ఎంతో మేలు చేస్తాయి.
కాకర ఆకులు యాంటీ డయాబెటిక్, యాంటీ వైరల్ లక్షణాలను కలిగి ఉంటాయి. చికెన్ పాక్స్ ను, మీజిల్స్ ను తగ్గించడంలో కాకర ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి. కాకర ఆకులలో విటమిన్ బితోపాటు ఐరన్, ఫాస్పరస్ వంటి మినరల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. శ్వాసకోస సంబంధమైన సమస్యలను, మొలలను, కలరాను తగ్గించడంలోనూ కాకర ఆకులు సహాయపడతాయి. మధుమేహాన్ని తగ్గించడంలో కాకర ఆకులు సమర్ధవంతంగా పని చేస్తాయి. ఒక గ్లాస్ నీటిలో కాకర ఆకులను వేసి 15 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇలా మరిగించిన నీటిని వడకట్టి ఉదయం పూట నెలరోజుల పాటు తాగుతూ ఉండడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది.
![Bitter Gourd Leaves : కాకర ఆకుల వల్ల కలిగే లాభాలు తెలిస్తే.. అసలు విడిచిపెట్టరు..! Bitter Gourd Leaves can be helpful in these health conditions](http://3.0.182.119/wp-content/uploads/2022/10/bitter-gourd-leaves.jpg)
ఈ ఆకుల రసాన్ని తాగడం వల్ల విరేచనాలు, కలరా తీవ్రతరం కాకుండా ప్రారంభ దశలోనే తగ్గుతాయి. కాకర ఆకుల పేస్ట్ ను, దువ్వి ఆకుల పేస్ట్ ను కలిపి దానికి తేనెను కలిపి ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు, ఉబ్బసం వంటి సమస్యలు తగ్గుతాయి. ఈ ఆకుల రసాన్ని తీసుకోవడం వల్ల ఆర్థరైటిస్ వల్ల కలిగే నొప్పులు కూడా తగ్గుతాయి. కాలిన గాయాలపై, దద్దుర్లపై కాకర ఆకుల పేస్ట్ ను రాయడం వల్ల అవి త్వరగా తగ్గిపోతాయి.
ఈ ఆకుల రసాన్ని అరికాళ్లకు, చేతులకు రాయడం వల్ల మంటలు తగ్గుతాయి. ఇన్ని ఉపయోగాలు ఉన్నప్పటికీ గర్భిణీ స్త్రీలు కాకర ఆకులను ఉపయోగించరాదు. వీటిని గర్భిణీ స్త్రీలు తీసుకోవడం వల్ల గర్భస్రావం అయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని దేశాలలో గర్భస్రావం చేయడానికి కూడా కాకర ఆకులను ఉపయోగిస్తారు. ఈ ఆకుల రసాన్ని మోతాదుకు మించి తీసుకోకూడదు. ఈ ఆకుల రసాన్ని పావు కప్పు (30 ఎంఎల్) కంటే ఎక్కువగా తీసుకోరాదు. ఈ ఆకుల రసాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల వాంతులు అయ్యే అవకాశం కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.