బాక్సాఫీస్ వ‌ద్ద బింబిసార క‌లెక్ష‌న్ల ఊచ‌కోత‌.. భారీగా లాభాలు..

నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ చాలా రోజుల త‌రువాత బింబిసార మూవీతో హిట్ కొట్టాడు. కొత్త ద‌ర్శ‌కుడు మ‌ల్లిడి వ‌శిష్ట ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన బింబిసార మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల సునామీని సృష్టిస్తోంది. తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో క‌ల్యాణ్ రామ్ త‌నకంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును చాటుకున్నా.. ఆయ‌న న‌ట‌న‌లో మాత్రం ఇత‌ర హీరోల‌కు చాలా భిన్న‌మ‌నే చెప్ప‌వ‌చ్చు. నిర్మాత‌గా కూడా కొత్త హీరోలు, ద‌ర్శ‌కుల‌ను ఆయ‌న ప్రోత్స‌హిస్తుంటారు. ఇక తన సొంత బ్యాన‌ర్ ఎన్టీఆర్ ఆర్ట్స్‌పైనే బింబిసార‌ను నిర్మించారు. ఈ క్ర‌మంలోనే మూవీ రికార్డుల‌ను కొల్ల‌గొడుతోంది.

కళ్యాణ్ రామ్ త‌న సొంత బ్యానర్‌లో నిర్మించిన బింబిసారను పూర్తి చేసేందుకు 3 ఏళ్లు ప‌ట్టింది. 2019 నుంచి ఈ సినిమాపై పని చేస్తున్నారు. ఈ సారి తన కెరీర్‌లోనే బ్లాక్‌ బాస్టర్ హిట్‌గా నిలిచిన పటాస్‌ సినిమా కలెక్షన్ల కంటే రెండు రెట్లు ఎక్కువగానే బడ్జెట్‌ను ఖ‌ర్చు చేసి సినిమా తీశారు. దాదాపుగా రూ.40 కోట్ల బడ్జెట్‌తో బింబిసారను తెర‌కెక్కించారు. ఈ మూవీ ఆగస్టు5న ప్రేక్షకుల ముందుకు వ‌చ్చింది. అద్భుతమైన విజయాన్ని న‌మోదు చేసింది.

bimbisara movie huge collections at box office on 3rd day

కాగా ఈ మూవీకి మొదటి రోజే రూ.6.30 కోట్ల షేర్ రాగా, రూ.9.30 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఆదివారం కావడంతో కలెక్షన్ల జోరు మరింత పెరిగింది. 3వ‌ రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.29.80 కోట్ల గ్రాస్‌, రూ.18.10 కోట్ల షేర్ ను సాధించింది. అయితే కల్యాణ్ రామ్ బింబిసార కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించడం విశేషంగా చెబుతున్నారు. మూడో రోజు నైజాంలో రూ. 5.66 కోట్లు, వైజాగ్‌లో రూ.2.26 కోట్లు, సీడెడ్ రూ.3.38కోట్లు, నెల్లూరు రూ.50 లక్షలు, గుంటూరు రూ.1.27 కోట్లు, కృష్ణా జిల్లా రూ.88 లక్షలు, తూర్పు గోదావ‌రి రూ.1.02 కోట్లు, పశ్చిమ గోదావ‌రి రూ.73క్షలు, యూఎస్‌ఏ రూ.1 కోటి, మిగిలిన ప్రాంతాల‌లో రూ.32 లక్షల క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే ఈ మూవీతో క‌ల్యాణ్ రామ్ ద‌శ తిరిగింద‌నే అంటున్నారు.

Share
editor

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago