Bigg Boss : టీవీ రియాల్టీ షోలలో బిగ్ బాస్ షో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన కార్యక్రమంగా నిలిచింది. నాగార్జున వ్యాఖ్యాతగా ఉండడం కూడా ఈ షోకి అదనపు ఆకర్షణగా చెబుతున్నారు. ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ 6వ సీజన్ మంచి రేటింగ్ తో విజయవంతంగా నడుస్తుంది. 5 వారాలు పూర్తి చేసుకొని 6వ వారంలోకి ప్రవేశించింది. ఇంకా 16 మంది కంటెస్టెంట్లు మిగిలి ఉన్నారు. అయితే 5వ వారం అనూహ్యంగా చలాకీ చంటి బిగ్ బాస్ హౌజ్ నుండి నిష్క్రమించడం అందరినీ షాక్ కు గురి చేస్తోంది.
5వ వారం ఎలిమినేషన్ కి నామినేట్ అయిన 8 మందిలో చలాకీ చంటి ఒకడు. చంటితోపాటు మెరీనా అబ్రహం, వాసంతి కృష్ణ, ఇనాయా సుల్తానా, ఫైమా, ఆది రెడ్డి, బాలాదిత్య, అర్జున్ కళ్యాణ్ మొదలైన వారు నామినేషన్స్ లో ఉన్నారు. అయితే నామినేషన్ సమయంలో గీతూ, చంటి జంటగా ఉన్నారు. అయితే మీలో ఎవరు సేవ్ అవుతారు, ఎవరు నామినేట్ అవుతారు అని బిగ్ బాస్ వాళ్లను అడిగాడు. అప్పుడు గీతూ చంటి కంటే తానే బాగా చేయగలనని కాబట్టి తనను నామినేట్ చేయొద్దని వాదించింది. చంటి కూడా ఆ సమయంలో కావాలనే నిశ్శబ్ధంగా ఉండిపోయాడు. నామినేషన్ కు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.
![Bigg Boss : బిగ్ బాస్ నుంచి చలాకీ చంటి ఔట్.. షాకవుతున్న ప్రేక్షకులు.. Bigg Boss Telugu Season 6 Chalaki Chanti got evicted](http://3.0.182.119/wp-content/uploads/2022/10/chalaki-chanti.jpg)
అయితే గత వారంలో తనకు కీర్తి భట్ ఇంకా గీతూ ల మధ్య జరిగిన వివాదంపై ప్రేక్షకుల స్పందనను తెలుసుకోవడానికే చంటి ఇలా చేశాడని తెలిసింది. అయితే ప్రేక్షకులను ఆకర్షించగల.. అలాగే బాగా ఎంటర్ టెయిన్ చేయగలిగిన చంటి ఎలిమినేట్ అవడం ఈ షో కు పెద్ద లాస్ అని కొందరు అభిప్రాయపడుతున్నారు. చంటి వెళ్లిపోవడం బిగ్ బాస్ ప్రేక్షకులను కూడా షాక్ కి గురిచేసిందని అంటున్నారు.