Deepthi Sunaina : సోషల్ మీడియాతో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ దీప్తి సునయన. యూట్యూబ్ ద్వారా మరింత పాపులారిటీ రాబట్టిన ఈ భామ, అనేక కవర్ సాంగ్స్, ప్రైవేట్ ఆల్బమ్స్ చేసింది. అలాగే షణ్ముఖ్ జస్వంత్ తో కలిసి షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్లు చేసి అదే సమయంలో అతనితో ప్రేమలో పడింది. బిగ్ బాస్ సీజన్ 3లో దీప్తి సునైన పార్టిసిపేట్ చేసింది. హౌస్లో బాగానే రాణించింది అమ్మడు. 10 వారాలు హౌస్లో ఉంది. దీప్తి సునయన గ్లామర్, డాన్సులు హైలెట్ గా నిలిచాయి. అయితే దీప్తి సునయన ప్రియుడు షణ్ముఖ్.. సిరితో చేసిన రచ్చతో అతనికి బ్రేకప్ చెప్పి ఇప్పుడు సోలోగా ఉంటుంది. సోషల్ మీడియాలో ఫోటో షూట్స్ తో హోరెత్తిస్తుంది.
కాగా దీప్తి సునైన కారును కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. టయోటా హైలెక్స్ ని ఆమె సొంతం చేసుకున్నారు. కొత్త కారు పక్కన నిల్చుని ఫోజులిచ్చింది. సదరు ఫోటోలపై థాంక్ యూ ప్రదీప్ రెడ్డి అండ్ డాడీ అని రాసుకొచ్చింది. వారు బహుమతిగా ఇచ్చారేమో అనిపిస్తుంది. ఇక టయోటా హైలెక్స్ ధర రూ. 30-37 లక్షల వరకూ ఉంటుందని సమాచారం. దీప్తి సునైనకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే దీప్తి కొన్న కారుకి స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి.ఈ వాహనం స్పెషాలిటీ ఏమిటంంటే డ్రైవర్ తోపాటు మరో ముగ్గురు ఏసీ క్యాబిన్లో కూర్చొవచ్చు.
అలాగే వెనక లగేజీ పెట్టుకోవడానికి స్పేస్ ఉంటుంది. ఇలాంటి వాహనాలను ఫారెన్ లో క్యారవాన్లుగా మార్చుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. అలాగే ఈ వాహనం బేసిక్ మోడల్ దాదాపు రూ. 30 లక్షలు ఉంటుంది.. ఇక హై ఎండ్ మోడల్ అయితే రూ.37 లక్షల వరకు ఉంటుంది. దీప్తికి ఇప్పుడు ఇలాంటి వాహనంతో ఏంటీ పని ?.. ఎందుకు తీసుకుంది ఇలాంటి ప్రత్యేక వాహనం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే దీప్తి సునయనకు ఫ్యాన్స్ విషెస్ తెలుపుతున్నారు.