Bhuma Mounika : మంచు ఫ్యామిలీలో ఈ మధ్యే ఓ శుభకార్యం జరిగిన విషయం తెలిసిందే. మంచు మనోజ్.. భూమా మౌనిక రెడ్డిని రెండో పెళ్లి చేసుకోగా, ఈ వివాహానికి మంచు లక్ష్మీ ఇల్లు వేదికైంది. ఈ కల్యాణం చాలా వైభవంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా చాలా వైరల్ అయ్యాయి. ఇక తన పెళ్లిపై చేసిన ఓ స్పెషల్ వీడియోను మనోజ్ ట్విట్టర్‌లో పంచుకున్నారు. ఈ వీడియోలో మనోజ్- మౌనిక ప్రీ వెడ్డింగ్ షూట్ నుంచి మెహందీ, పెళ్లి, రిసెప్షన్ వరకు మొత్తం కవర్ చేశారు. ‘ఏం మనసో.. ఏం వరసో’ అంటూ సాగిన ఈ పాట లిరిక్స్‌ను ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ రాయడం విశేషం. పెళ్లి తర్వాత దంపతులు ఇద్దరు హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుండగా, రీసెంట్‌ఘా మంచు మనోజ్ తన భార్య భూమా మౌనిక రెడ్డితో కలిసి ‘అలా మొదలైంది అనే టాక్ షోకు హాజరయ్యాడు.
వెన్నెల కిశోర్ హోస్ట్ చేస్తున్న ఈ షోకు హాజరైన మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డి ఎన్నో సంగతులు పంచుకున్నారు. మౌనిక మాట్లాడుతూ .అమ్మ జయంతి రోజున అలా ఆకాశం చూస్తూ ఎక్కడున్నావు.నాకేం కావాలో నీకు తెలుసు.అంతా నీకే వదిలేస్తున్నాను అని అన్నాను.అప్పుడే మనోజ్ వచ్చారు.అది నా జీవితంలో మర్చిపోలేని రోజు అని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత మంచు మనోజ్ మాట్లాడుతూ .మౌనికతో పెళ్లికి ముందు గడిపిన క్షణాలు, ఎదురైన సమస్యల గురించి మాట్లాడాడు. ఉప్పెన సినిమాలో మాదిరిగా మేమూ పెళ్లికి ముందు చాలా ఇబ్బందులు పడుతూనే బాగానే తిరిగాం.అందులో ఈశ్వర సాంగ్ ఐదు నిమిషాలుంటే .మా లైఫ్‌లో కొన్ని సంవత్సరాలు ఉంది. .మేము దేశ దేశాలు, ఊర్లు తిరుగుతూ ఉన్నామని అన్నాడు.
నేను మౌనిక కోసం వెళ్లాలి.అక్కడే ఉండాలి అని ఊహించేసుకుని ఆమెకు హెల్ప్ చేయాలనుకున్నప్పుడు ఇబ్బందులు పడ్డాను. ప్రేమ అనేది రెండు పక్కలా ఉండాలి.ఎటు పక్క నిలబడుతున్నానో, ఎక్కడున్నారో ఏం అర్థం కాలేదు. సరే నీకు లవ్ లైఫ్ కావాలా? సినిమా కావాలా? సెలెక్ట్ చేసుకో అనే పరిస్థితి వచ్చింది . ఆ సమయంలో ఏది సెలక్ట్ చేసుకోవాలో అర్ధం కాలేదు. అలా జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డామని మనోజ్ కూడా వెల్లడించారు..మొదట మనోజ్ తన చిన్ననాటి స్నేహితురాలు ప్రణతి రెడ్డితో ప్రేమాయణం సాగించి 2015లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోగా, ఈ బంధం ఎంతో కాలం నిలవలేదు. ఇక రెండో పెళ్లిగా మౌనిక రెడ్డిని వివాహమాడాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…