Bhanu Priya : చారడేసి కళ్లు.. కోలాటమాడే కనురెప్పలు అనగానే మనందరికి భానుప్రియ గుర్తుకు వస్తుంది. వెండితెరపై ఆమె చేసిన కవాతు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. 1980లలో ఒక వెలుగు వెలిగిన భానుప్రియ, ప్రస్తుతం తన స్థాయికి తగిన కేరక్టర్ రోల్స్ చేస్తూ వెళుతున్నారు.తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “బాపు గారు అంటే నాకు చాలా ఇష్టం .. తన సినిమాల్లో ఆయన హీరోయిన్ ను చూపించే స్టైల్ నాకు బాగా నచ్చుతుంది. హీరోయిన్ కళ్లకు ఆయన ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉంటారు.
అందువలన ఆయన నుంచి నాకు పిలుపు వస్తుందని నేను ఎదురు చూశాను. కానీ ఆయన నుంచి నాకు అవకాశం రాలేదు. ఆయనను నేను కలవలేకపోయాను కూడా. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయనతో సినిమా రాసిపెట్టి లేదంతే” అని అన్నారు. “ఇక విశ్వనాథ్ గారి విషయానికి వస్తే .. షూటింగులో బాగా చేస్తే ‘చాలా బాగా వచ్చింది’ అని భుజం తట్టి అభినందించేవారు. వెంకటేశ్ గారు డాన్స్ విషయంలో మా అత్తమ్మ దగ్గర స్టూడెంట్. అప్పట్లో ఆయన ఎక్కువగా మాట్లాడేవారు కాదు .. చాలా రిజర్వ్డ్ గా ఉండేవారు. తెరపై మా కాంబినేషన్ కి మంచి పేరు వచ్చింది” అని చెప్పారు.
సుమన్ గారితో 14 సినిమాలు చేసిన భానుప్రియ ఆయన గురించి గొప్పగా చెప్పింది.చాలా మంచి వ్యక్తి అంటూ తెగ పొగడ్తలు కురిపించింది. ఇక బాలకృష్ణ గారితో 9 సినిమాలు చేసినట్టు చెప్పిన భానుప్రియ ఆయన నేను స్కూల్ ఫ్రెండ్స్ మాదిరిగా ఉంటాం. మంచి వ్యక్తి అని తెలిపింది. అమ్మతో కూడా చాలా ప్రేమగా మాట్లాడతారు. అమ్మకి బాలయ్య గారు చాలా ఇష్టమని భానుప్రియ పేర్కొంది. బాలయ్యని కలిసి చాలా రోజులైంది. ఒకసారి ఎయిర్‌పోర్ట్‌లో కలిసినప్పుడు చాలా సరదాగా మాట్లాడారు.హైదరాబాద్ వస్తే ఒకసారి ఇంటికి రా అని తన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారని భానుప్రియ చెప్పుకొచ్చింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…