Bhanu Priya Meena : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ కస్టడీ కొనసాగుతుండగానే ఎమ్మెల్సీ కవిత.. తన అరెస్ట్‌పై ఇవాళ సుప్రీంకోర్ట్‌లో పిటిషన్ దాఖలు చేయడం ఆసక్తికరంగా మారింది. కాగా.. కవిత రిట్ పిటిషన్ పై అత్యున్నత న్యాయస్థానం తీసుకునే నిర్ణయం ఎలా ఉండనుందనేది ఆసక్తికరంగా మారింది. లిక్కర్ కేసులో తనను అక్రమంగా అరెస్ట్ చేశారని.. ఈ కేసులో తన ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు లేవoటూ కవిత పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రతివాదిగా ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ చేర్చారు. ఇదిలాఉంటే.. మరోవైపు కవిత భర్త అనిల్‌ను విచారించేందుకు సిద్ధమైంది ఈడీ. ప్రధానంగా మనీలాండరింగ్‌పై ప్రశ్నాస్త్రాలు సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది.
అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయడంపై మాజీ మంత్రి, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈడీ అధికారురి భానుప్రియ మీనా తదితరులతో వాగ్వాదానికి దిగారు. వారిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కవితను అరెస్ట్ చేశారనే విషయం తెలిసిన కేటీఆర్, హరీశ్ రావు ఆమె నివాసానికి చేరుకున్నారు. విచారణ ముగిసిన అనంతరం కవిత ఇంట్లోకి వెళ్లిన కేటీఆర్… ఈడీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి వీడియో వెలుగు చూసింది. సోదాలు పూర్తయ్యాయని, అరెస్ట్ వారెంట్ ఇచ్చామని ఈడీ అధికారి భానుప్రియ మీనా చెబుతున్నారని, అలాగే అరెస్ట్ వారెంట్ ఇచ్చామని ఆమె చెబుతున్నారని పేర్కొన్నారు.
ఇప్పుడు ఈడీ ఆఫీసర్ భానుప్రియ ఎవరు అనే దానిపై ఆసక్తికర చర్చ నడుస్తుంది. 2005 రెవిన్యూ డిపార్ట్‌మెంట్ క్యాడర్‌కి చెందిన ఆమె స్వస్థలం రాజస్థాన్. ఆమె తండ్రి పలుమార్లు ట్రాన్సఫర్ అవుతున్న కారణంగా చాల చోట్ల చదువుకున్నారు ఆమె. అయితే హయ్యర్ ఎడ్యుకేషన్ మాత్రం ఢిల్లీలో చేసింది. తండ్రి, అక్కని చూస్తూ పెరిగిన భానుప్రియ సివిల్స్‌కి వెళ్లాలని అనుకున్నారు. అనుకున్నట్టుగానే 2005లో కొట్టింది. మొదట ప్రాక్టీస్ డిపార్ట్‌మెంట్‌లో చేసి ఆ తర్వాత ఈడికి షిప్ట్ అయ్యారు. ప్రస్తుతం ఎన్‌ఫోర్స్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…