Best Horror Movie In OTT 2024 : ఇటీవల ఓటీటీలో మంచి కంటెంట్ ఉంటుంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులకి పసందైన వినోదాన్ని పంచుతున్నాయి. అయితే హరర్ చిత్రాలు ఇటీవల ప్రేక్షకులకి మంచి వినోదాన్ని పంచుతున్నాయి. మాములుగా సినిమా చూస్తుంటే భయపడాలి, భయపడుతూనే సినిమా చూడాలి, సస్పెన్స్, థ్రిల్లర్, హారర్ ఎలిమెంట్స్ కావాలి. అలాంటి సినిమాలను వెతికి చూసేవారు చాలా మంది ఉన్నారు. అయితే హరర్ సినిమాలని ఇష్టపడే వారు తుంబాద్ మూవీని తప్పనిసరిగా చూడాలి.2018లో విడుదలైన తుంబాద్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించడమే కాకుండా, రివ్యూల పరంగానూ మెప్పు పొందింది.
మహారాష్ట్రలోని తుంబాద్ గ్రామంలో దాగి ఉన్న నిధి గురించి సాగే అన్వేషణతో కథ ఇది. అత్యాశ మనిషికి ఎలాంటి పరిస్థితికి దిగజారుస్తుందో సినిమాలో చక్కగా చూపించారు. తుంబాద్ ను ఆరేళ్ల పాటు తెరకెక్కించారు. అనేక సన్నివేశాలను రీషూట్ చేయాల్సి వచ్చింది. మైథలాజికల్ హారర్ బ్యానర్‌లో వచ్చిన ఈ మూవీకి రాహి అనిల్ బార్వే, ఆనంద్ గాంధీ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. చిన్న సినిమాగా విడుదలైన తుంబాద్ బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించింది. ఇక ఈ సినిమాకు వచ్చిన ఆధరణతో అన్ని భాషల ప్రేక్షకుల నుండి భారీ డిమాండ్ ఏర్పడింది. దాంతో మేకర్స్ పలు భాషల్లోకి డబ్ చేసి రిలీజ్ చేశారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయగా.. ప్రతి భాషలో కలెక్షన్‌ల పరంగా సరికొత్త రికార్డ్ సృష్టించింది.
లాక్డౌన్ సమయంలో ఓటీటీలోకి వచ్చి కూడా తెగ సందడి చేసింది. ఈ సినిమాలో వినాయక్ రావుగా సోహమ్ షా ప్రధాన పాత్ర పోషించారు. ఇది 20వ శతాబ్దంలో భారతదేశంలోని మహారాష్ట్రలోని తుంబద్ గ్రామంలో జరిగిన నిధి వేటను కళ్లకికట్టినట్టు చూపిస్తుంది. 104 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా కేవలం 5 కోట్లతో నిర్మించారు. ఈ చిత్రం విడుదలై 13 కోట్లకు పైగా లాభాన్ని సాధించింది. దీన్ని సినిమాటిక్ మాస్టర్ పీస్ అంటారు కొందరు సినీ ప్రియులు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుండగా, చిత్రాన్ని ఒంటరిగా రాత్రి వేళ చూస్తే భయపడడం ఖాయం.