Chiranjeevi : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఇటీవల వార్తలలో తెగ నిలుస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఉపాసనకు మన సంస్కృతి, సంప్రదాయాలు అంటే ఎంతో గౌరవం. ప్రతి పండగను ఆమె ఎంతో వేడుకగా జరుపుతుంటారు. ఈ వేడుకల్లో కుటుంబ సభ్యులతో పాటు పేదలు, అనాథలను కూడా ఆమె భాగం చేస్తుంటారు. ఉపాసన మెగా కోడలు అయిన తరవాత కూడా తన సంప్రదాయాలను ఏ మాత్రం వదిలిపెట్టలేదు. అత్తమామలు, భర్త, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి పండుగలను జరుపుకుంటున్నారు. ఇటీవల ఈ కుటుంబంలోకి మెగా ప్రిన్స్ క్లీంకార రావడంతో వారికి కొత్త ఉత్సాహం వచ్చింది. క్లీంకారతో కలిసి ఇప్పుడు పండుగలు జరుపుకుంటున్నారు.
ఈ క్రమంలో మెగా ఫ్యామిలీలో కూడా ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. మెగా ఫ్యామిలీలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల వీడియోని ఉపాసన తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.బాలిక నిలయం సేవా సమాజ్ కి చెందిన అనాథ పిల్లలు, మహిళలతో కలిసి ఉపాసన బతుకమ్మ వేడుకలు జరుపుకుంది. ఈ సేవా సమాజ్ ని ఉపాసన వాళ్ళ బామ్మ స్థాపించారు. ఆవిడ లేకపోయినా ఈ సేవా సమాజ్ బాగోగులు అన్ని ప్రస్తుతం ఉపాసననే చేసుకుంటున్నట్టు సమాచారం. అప్పుడప్పుడు అక్కడికి వెళ్లి పిల్లలతో సరదాగా గడుపుతుంది కూడా. తాజాగా ఈ సేవా సమాజ్ పిల్లలు, మహిళలు ఇంటి ఆవరణలో బతుకమ్మలని ఏర్పాటు చేయగా అందరితో కలిసి బతుకమ్మ ఆడారు మెగా ఫ్యామిలీ.
ఈ పండుగలో అనాథ పిల్లలను బాలికలను భాగం చేయడం ద్వారా ఉపాసన అమ్మమ్మకు ఘన నివాళి అర్పించారు చరణ్ దంపతులు. హైదరాబాద్‌లో మూడు దశాబ్దాలకు పైగా సేవా సమాజ్‌ను నడిపించారు ఉపాసన అమ్మమ్మ పుష్పా కామినేని. ఇక బతుకమ్మ వేడుకలోచిరంజీవి దంపతులు, చిరంజీవి తల్లి, చరణ్ దంపతులు, సాయి ధరమ్ తేజ్, చిరంజీవి కూతుళ్లు, మనవరాళ్లు.. మరికొంతమంది మెగా ఫ్యామిలీ మెంబర్స్ కూడా పాల్గొన్నారు. ఉపాసన క్లీంకారని కూడా ఈ వేడుకలకు తీసుకొచ్చింది. అక్కడకు వచ్చిన మహిళలకు మెగా ఫ్యామిలీ చీరలను పంచిపెట్టింది. ఈ బతుకమ్మ వేడుకల వీడియోని ఉపాసన తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. బాలిక నిలయం సేవా సమాజ్ తో బతుకమ్మ సెలబ్రేషన్స్ చేసుకోవడం ఆనందంగా ఉంది అంటూ దసరా శుభాకాంక్షలు తెలిపింది.