Bangaram: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బంగారం చిత్రం ప్రేక్షకులని పెద్దగా అలరించలేకపోయిందనే సంగతి మనందరికి తెలిసిందే. ఆ సినిమాలో హీరోయిన్ చెల్లి పాత్రకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. క్లైమాక్స్ లో హీరోయిన్ చెల్లి పై కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. ఆ సన్నివేశాల్లో చక్కగా నటించి మెప్పించిన ఆ అమ్మాయి పేరు శనూష. ఇప్పటికి బంగారం సినిమా పేరు చెప్పగానే ఆ అమ్మాయి గుర్తుకు వస్తుంది. బంగారం మూవీలో వింధ్యారెడ్డి పాత్రలో నటించింది శనూష. మలయాళంకు చెందిన.. ఆమె అక్కడ పలు చిత్రాల్లో బాలనటిగా నటిచింది. మలయాళంలో బాలనటిగా రెండు రాష్ట్ర స్థాయి అవార్డులను కూడా గెలుచుకుంది.
బంగారం సినిమాతోనే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన శనూష.. ఆ సినిమా చేస సమయానికి ఆమె వయస్సు కేవలం 10 ఏళ్లే. ఈ సినిమాలో పవన్ ను ఆటపట్టిస్తూ అందరిని ఆకట్టుకుంది. తెలుగులో బంగారం సినిమాతో ప్రేక్షకులను అలరించి ఈ అమ్మాయి.. ఆ తర్వాత ఐదేళ్లకు జీనియస్ అనే సినిమాతో హీరోయిన్‌గా తెలుగు వారిని పలకరించింది.ఆ సినిమా పెద్దగా ఆడకపోవడంతో తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. శనూష తమిళ్ రీమేక్ చిత్రం రేణిగుంట మూవీలో కీలకపాత్రలో నటించింది. 2019లో నాచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన చిత్రం జెర్సీలో జర్నలిస్టు పాత్ర చేసింది. ఆ సినిమాలో ఈ అమ్మడి పాత్ర చిన్నదే అయినా.. మంచి గుర్తింపు తెచ్చుకుంది.
తెలుగులో బాల నటిగా చేసిన వారిని మళ్లీ హీరోయిన్ గా ఆధరించేందుకు తెలుగు ప్రేక్షకులు ఆసక్తి చూపించరు. శనూష విషయంలో కూడా అదే జరిగింది. తమిళం మరియు మలయాళంలో హీరోయిన్ గా నటిస్తూ కెరీర్ లో ముందుకు సాగుతున్న శనూష తెలుగు లో మాత్రం హీరోయిన్ గా ఆఫర్లు దక్కించుకోవడంలో మాత్రం విఫలం అవుతోంది. ఈ మధ్య తెలుగు లో మళ్లీ ఆమె కనిపించలేదు. ప్రస్తుతం తమిళం మరియు మలయాళంలో అడపాదడపా సినిమాలు చేస్తూ కెరీర్ లో ముందుకు సాగుతుంది. తెలుగు లో ఆఫర్లు వస్తే తప్పకుండా నటిస్తానంటూ చెప్పుకొస్తుంది ఈ ముద్దుగుమ్మ.. చిన్న తనం నుంచే ఎంతో క్యూట్‌గా ఉంది శనూష. ప్రస్తుతం ఆ అమ్మాయి ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…