Bandla Ganesh Son : టాలీవుడ్ సినిమా పరిశ్రమలో నిర్మాతగా నటుడిగా మంచి అందుకున్న బండ్ల గణేష్ ఇటీవల సినిమాలు తగ్గించారు. ఇటీవల ఆయనకి జైలు శిక్ష విధించింది ఒంగోలు కోర్టు. అసలు సంగతిలోకి వెళితే, ఇటీవల జెట్టి వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి బండ్ల గణేష్ తన పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ తరపున ఇచ్చిన చెక్ బౌన్స్ అవడంతో అతడు కోర్టుకి వెళ్లడం జరిగింది.కాగా కొన్నాళ్లగా కోర్టులో కొనసాగుతున్న ఆ కేసులో తాజాగా ఒంగోలు సెకండ్ మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు తీర్పు ఇచ్చింది. బండ్ల గణేష్ కు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.95 లక్షల జరిమానాను కూడా విధించింది కోర్టు. అలానే ఈ తీర్పును బండ్ల గణేష్ ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేసుకునేందుకు నెల రోజుల గడువు కూడా ఇచ్చింది.
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ కొడుకు పోలీసులను ఆశ్రయించాడు. హీరా గోల్డ్ కుంభకోణంలో ప్రధాన నిందితురాలు నౌహీరా షేక్ తమపై దౌర్జన్యానికి పాల్పడిందంటూ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశాడు. హీరా గోల్డ్ కేసులో నౌహీరా షేక్ ను ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఆమెకు చెందిన ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుంది. అయితే ఈడీ స్వాధీనపర్చుకున్న ఇంటిని నౌహీరా షేక్ మోసపూరితంగా విక్రయించే ప్రయత్నం చేసిందని బండ్ల హీరేష్ ఫిర్యాదు చేశాడు. అంతే కాదు ఆ ఇంటి కొనుగోలుకు సంబంధించి ఇప్పటికే 3 కోట్లు తీసుకుని.. ఇప్పుడు ఖాళీ చేయాలంటూ రౌడీలతో బెదిరింపులకు పాల్పడుతున్నదంటూ బండ్ల హీరేష్ పోలీస్ లను ఆశ్రయించాడు. దీంతో ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
బండ్ల గణేష్ కొడుకు ఫిలింనగర్ రోడ్డునెంబర్–13 సైట్–2లోని ప్లాట్‌నెంబర్ 15–ఏలో నౌహీరా షేక్‌కు చెందిన ఇంట్లో 2023 నుంచి అద్దెకు ఉంటున్నాడు. కొంతకాలం తర్వాత ఆ ఇంటిని విక్రయిస్తానని నౌహీరా చెప్పడంతో ఆ ఇంటిని మేమే కొంటామని చెప్పి రూ. 3 కోట్లు చెల్లించినట్లు తెలిపాడు. ఈ క్రమంలో మొత్తం డబ్బు ముట్టజెప్పే సమయంలో ఆ ఇల్లు ఈడీ కేసులో ఉన్నట్లు తెలిసిందని.. దీనిపై నౌహీరాను వివరణ అడగగా తాను మాత్రం దాటవేస్తూ తప్పించుకుందని ఆయన ఆరోపించాడు. అంతే కాదు మిగతా డబ్బులు చెల్లించాలని తమపై ఒత్తిడి చేస్తుందని, ఇల్లు ఖాళీ చేయాలంటూ బెదిరింపులకు పాల్పడుతుందంటూ బండ్ల హీరేష్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు ఆయన పేరు హాట్ టాపిక్‌గా మారింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…