Bandla Ganesh : బండ్ల గణేష్.. ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. నిజాన్ని నిర్భయంగా మాట్లాడేతత్వం బండ్లది. ఈ నిర్మాత నిత్యం ఏదో ఒక పనిచేస్తూ సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంటారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే సినీ నిర్మాత బండ్ల గణేష్‌కి మితిమీరిన అభిమానం, ప్రేమ. పవన్‌కు వీరవిధేయుడిగా పేరొందని బండ్ల గణేష్ పవన్‌ని దేవుడిగా భావించమే కాదు.. ఆయనంటే ఎనలేని భక్తిని చూపిస్తూ ఉంటారు. కొందరు దాన్ని భజన అన్నా.. ఆ భజనను అంతకంతకూ పెంచుకుంటూనే పోతుంటాడు తప్ప తాను నమ్మిన దైవానికి విశ్వాసపాత్రుడ్ని అని పదే పదే చెబుతూ ఉంటారు. ఓవైపు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్, మరోవైపు బండ్లన్న ఫ్యాన్స్.. ఈయన మాట్లాడే మాటలను తెగ వైరల్ చేస్తుంటారు.
తాజాగా బండ్ల గణేష్ ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశారు. మోహన్ బాబు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బండ్ల గణేష్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాడు. మా ఎలక్షన్స్ సమయంలో మోహన్ బాబు నుండి కాల్ వచ్చినందుకు మీరు కాస్త వెనక్కి తగ్గారని టాక్ వచ్చింది కదా అని బండ్లని ప్రశ్నించగా, నేను ఎవరికి భయపడను అని అన్నాడు. నా మనసాక్షికి ఏం నచ్చిందో అది చేస్తాను తప్ప భయపడే ప్రసక్తి లేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బండ్ల గణేష్.. మోహన్ బాబుపై చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తి రేపుతున్నాయి.
![Bandla Ganesh : మోహన్ బాబుకి నేను భయపడతానా.. బండ్ల గణేష్ కామెంట్స్.. Bandla Ganesh sensational comments on mohan babu](http://3.0.182.119/wp-content/uploads/2023/11/bandla-ganesh.jpg)
ఇక బండ్ల గణేష్ ఇప్పుడు సినిమాలకి దూరంగా ఉంటూ అప్పుడప్పుడు రాజకీయాలలో తనదైన శైలిలో మాట్లాడుతుంటారు. మరోవైపు సోషల్ మీడియాలో సైతం ఈయన చేసే కామెంట్స్ నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంటాయి. ఒకప్పుడు కమెడీయన్‌గా తెగ అలరించిన బండ్ల ఇప్పుడు సినిమాలపై పెద్దగా ఫోకస్ పెట్టడం లేదు. ఇటీవల బండ్ల మాల ధరించి చెప్పులు వేసుకోవడం పట్ల కొందరు ఆయనపై విమర్శల జల్లు కురిపించారు.