Bandla Ganesh : సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ అప్పుడప్పుడు రాజకీయాల మీద సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తలలో నిలుస్తుంటారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్, నారా లోకేష్, వైసీపీ నేతలపై సంచలన కామెంట్స్ చేశారు. జగన్, రోజా, నాని వలన లోకేష్ ఇప్పుడు నిజమైన పొలిటీషన్ అయ్యాడని, వారికి ధన్యవాదాలు చెప్పాలని బండ్ల గణేష్ అన్నారు. నారా లోకేష్ పాదయాత్ర మొదలు పెట్టిన సమయంలో ఎవర్నో చూసి కాపీ కొట్టకూడదు అని మనసులో అనుకున్నానని.. లోకేష్ పాదయాత్ర ప్రారంభమైన సమయంలో ఏం చేస్తాడులే అని తనకు అనిపించిందని నిర్మా త బండ్ల గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు న్నారు. తన తల్లి అంటే ఎంత గౌరవమో.. నారా భువనేశ్వరి అంటే తనకు అంతే గౌరవం ఉందన్నారు.
భువనేశ్వరి తండ్రి ముఖ్యమంత్రి, భర్త ముఖ్యమంత్రి అయిన చాలా సింపుల్‌గా ఉంటారని గుర్తు చేశారు. తనది టీడీపీ కాదని.. చంద్రబాబుతో సంబంధం లేదు.. తనకు వాళ్లతో ఎలాంటి లబ్ధి కూడా అవసరం లేదన్నారు. భువనేశ్వరి మాట్లాడే పద్దతి, నడిచే విధానం, ఆవిడ క్రమశిక్షణను చూస్తే చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది. అయితే లోకేష్ పాదయాత్ర ప్రారంభించిన సమయంలో.. 20 రోజులో, 30 రోజులో చేసి వెనక్కు వస్తారని నేను అనుకున్నా..ఆ మహాతల్లి భువనేశ్వరి ఎంత బాధపడుద్దో అని అనుకున్నా అని బండ్ల గణేష్ తన మనసులో మాట చెప్పారు.

ఒకటో రోజు నుంచి ఇప్పటి వరకు ప్రతి రోజు గమనిస్తే లోకేష్ చాలా మారిపోయారన్నారు. రాజకీయాలపై పట్టు, జనరల్ నాలెడ్జ్, ప్రసంగాల్లో చాలా మార్పు కనిపించిందన్నారు. ఈ విషయంలో లోకేష్ వాళ్ల అమ్మకు, నాన్నకు థ్యాంక్స్ చెప్పకూడదని.. సీఎం జగన్, మంత్రి రోజా, కొడాలి నానిల కు థ్యాంక్స్ చెప్పాలన్నారు గణేష్. వాళ్లు తిట్టబట్టే లోకేష్ పౌరుషంతో ఇలా మారిపోయారని తన ఫీలింగ్ అన్నారు. గతంలో లోకేష్‌ను ఎన్నో అన్నారు, విమర్శించారని.. టీడీపీకి అధికారం వస్తదో రాదో తెలియదు కానీ.. లోకేష్ సక్సెస్‌ఫుల్ పొలిటీషియన్ అయ్యారని.. మంచి భవిష్యత్ కూడా ఉంటుందన్నారు. ఇక పవన్ అన్నీ వదిలేసి రోడ్ల మీదకు వచ్చారు. ఆయన తప్పు మాట్లాడితే ప్రభుత్వం, మంత్రులు హుందాగా విమర్శించాలి కానీ.. నోటికి ఏదొస్తే అది మాట్లాడొద్దని అన్నారు బండ్ల గణేష్.