Bandla Ganesh : బండ్ల గణేష్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆయన ఎప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడతాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పవన్ కళ్యాణ్ భక్తుడిగా మంచి పేరు తెచ్చుకున్న బండ్ల గణేష్ మంచి నిర్మాతగా పేరు తెచ్చుకున్నాడు. తాజా ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ ఆసక్తికర విషయాలు తెలియజేశాడు. చిరంజీవి గారిని నేను ప్రేమిస్తాను. ఆయన అంటే ఎంతో ఇష్టం. నందమూరి ఫ్యామిలీకి నేను దూరం కాదు. ఎన్టీఆర్ తో రెండు సినిమాలు చేశారు. చిరంజీవి గారంటే ఇష్టం కాబట్టి ఆయనకు దగ్గరగా ఉంటాను. బాలయ్య అంటే కోపం కాదు. నాకు ఆయనపై ఎందుకు శత్రృత్వం ఉంటుంది. అలానే నాకు కులం, మతం, ప్రాంతం వంటి పట్టింపులు ఉండవు అని బండ్ల చెప్పుకొచ్చారు.
ఇక బండ్ల గణేష్ మొదటి నుంచి తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెబుతున్నారు. ఆదివారం తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 49 కేంద్రాల్లో కౌంటింగ్ జరగనుంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో కౌంటింగ్ ప్రక్రియ మొదలు కానుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని నిర్మాత బండ్ల గణేష్ అన్నారు. బండ్ల గణేష్ శనివారం ఉదయం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. కాంగ్రెస్ 90 సీట్లు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో హస్తం సునామీ వస్తుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చాలా మంది గొప్ప నేతలు ఉన్నారని చెప్పిన బండ్ల రేవంత్ రెడ్డి సీఎం అవుతారని పేర్కొన్నారు.
76 నుంచి 85 సీట్లు వస్తాయని రాత్రి వరకు అనుకున్నాను. కానీ ఇప్పుడు 90 వస్తాయని అనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రం మొత్తం పండగ రోజు. పదేళ్ల బాధను, దు:ఖాన్ని చీల్చుకొని, చెండాడి రేపటి నుంచి మాకు దీపావళి, దసరా, సంక్రాంతి అన్నీ స్టార్ట్ అవుతున్నాయి. బ్రహ్మోత్సవాలు కూడా వస్తున్నాయి. రాబోయే 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా పరిపాలించాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అద్భుతంగా, ఎక్స్‌ట్రార్డినరీగా ముందుకెళ్తాం’ అని బండ్ల గణేష్ అన్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…