Bandla Ganesh : సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌మాణ స్వీకారం.. ర‌చ్చ ర‌చ్చ చేసిన బండ్ల గ‌ణేష్..

Bandla Ganesh : కాంగ్రెస్ నాయ‌కులు క‌న్న క‌ల నెర‌వేరింది. ఎంతో మంది కార్త‌క‌ర్త‌లు, నాయ‌కులు ఎప్ప‌టి నుండో కాంగ్రెస్ అధికారంలోకి రావాల‌ని కోరుకున్నారు. అయితే తెలంగాణ ఏర్ప‌డిన ప‌దేళ్ల త‌ర్వాత కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ‌చ్చింది. దీంతో ప్ర‌తి ఒక్క‌రు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.అయితే రేవంత్ రెడ్డి సీఎం అవ్వ‌డంపై బండ్ల గ‌ణేష్ చాలా ఆనందం వ్య‌క్తం చేశాడు. అయితే రేవంత్ ప్ర‌మాణ స్వీకారానికి ముందు తాను చెప్పినట్లుగానే తాను 200 పర్సెంట్ ఈ రోజు రాత్రికి ఎల్బీ స్టేడియంలోనే నిద్రపోతానంటున్నారు బండ్ల గణేష్‌. అన్ని ఏర్పాట్లు చూసుకుంటూ.. పనులు చేయడానికి టైం పడుతుందని అని చెప్పుకొచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం, రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం సంతోషంగా ఉందన్నారు. ఈ విషయం తనకు ముందే తెలుసని.. తనకేం పదవి అక్కర్లేదని చెప్పారు.

గ్రౌండ్ లెవల్లో పనిచేసిన ఎమ్మెల్యేలకు కూడా నమ్మకంలేని వేళ.. మీరు అంత కచ్చితంగా రేవంత్ రెడ్డి సీఎం అవుతారని ఎలా అంచనా వేయగలిగారని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. బండ్ల గణేష్ బదులిస్తూ.. ‘రేవంత్‌ రెడ్డి పోరాటం, ఆయన పడిన కష్టం, ఆయన మాట్లాడిన తీరు, జనంలోకి చొచ్చుకెళ్లిన విధానం చూసే.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, రేవంత్ రెడ్డి సీఎం అవుతారని చెప్పా’ అని అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. ఇకపై మీరు యాక్టివ్‌గా మారే అవకాశం ఉందా? అని ప్రశ్నించగా.. తానెప్పుడూ కాంగ్రెస్‌ పార్టీకి విధేయుడిగానే ఉన్నానని, ఇప్పటివరకు ప్రతిపక్షంలో ఉన్నందువల్ల ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉన్నానని బండ్ల గణేష్ చెప్పారు.

Bandla Ganesh behavior in cm revanth reddy oath ceremony
Bandla Ganesh

‘నేను జంప్ జిలానీని కాదు. 2004 నుంచి కాంగ్రెస్‌లోనే ఉన్నాను. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి కాంగ్రెస్‌లోనే ఉన్నాను. నేను కాంగ్రెస్‌ వాదిని అనేది ప్రపంచానికి తెలిసిన నిజం. రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్‌లోనే ఉన్నాను. పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉండటం వల్ల.. నా పని నేను చేసుకుంటూ, ఎంత వరకు ఉండాలో, అంత వరకే ఉన్నాను. మా పార్టీ అధికారంలోకి రావడం సంతోషంగా ఉంది’ అని బండ్ల గణేష్ అన్నారు.కాంగ్రెస్‌ పాలన బ్రహ్మాండంగా ఉంటుందని, రేవంత్‌ నాయకత్వంలో పార్టీ బ్రహ్మాండంగా పనిచేస్తుందని.. అందులో సందేహమే అవసరం లేదని బండ్ల గణేష్ చెప్పారు. ఎన్నికల ముందు చెప్పినట్లు 6 గ్యారంటీలను అమలు చేస్తామని తెలిపారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago