Balakrishna : ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్ హీరోలలో బాలయ్య ఒకరు కాగా, ఆయన సినిమాలు, టీవీ షోస్‌తో తెగ సందడి చేస్తున్నాడు. టాలీవుడ్‌లో అద్భుతంగా డైలాగులు చెప్పే హీరో ఎవరు అని అడిగితే చాలా మంది నోటి నుంచి వచ్చే పేరు నందమూరి బాలకృష్ణ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి భారీ డైలాగ్ అయిన సరే గుక్కతిప్పుకోకుండా పేజీల పేజీలు డైలాగులు చెప్పేయడం బాలయ్య స్పెషాలిటి. అయితే, తన డైలాగ్ డెలివరీలోని పవర్‌ను, రిథమ్‌ను బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్‌కు చూపించారు బాలకృష్ణ. దీనికి అన్‌స్టాపబుల్ షో వేదికైంది. అచ్చ తెలుగులో కాకుండా.. హిందీలో గుక్కతిప్పుకోకుండా ఓ డైలాగ్ విసరడంతో తన ఎదురుగా కూర్చున్న బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్ షాక్ అయ్యాడు.
డిసెంబర్ 1న విడుదల కానున్న యానిమల్ మూవీ ప్రమోషన్ లో భాగంగా చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, హీరో రణ్బీర్ కపూర్, హీరోయిన్ రష్మిక మందన.. అన్‌స్టాపబుల్ షోలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ‘ఆహా’ లో ఇప్పుడు ఫుల్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ ఎపిసోడ్ చూసిన కొంతమంది సోషల్ మీడియా ద్వారా తమ స్పందిస్తున్నారు. ముఖ్యంగా బాలయ్య గుక్కతిప్పుకోకుండా చెప్పిన హిందీ డైలాగులకు సంబంధించిన క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎంత స్క్రిప్టెట్ షో అయినా అంత పెద్ద డైలాగులు గుర్తుపెట్టుకుని అలా చెప్పడం నిజంగా గ్రేటని అంటున్నారు.ముఖ్యంగా బాలకృష్ణ డైలాగులకు రణ్‌బీర్ కపూర్ ఫిదా అయిపోవడం విశేషం.
బాలయ్య చెప్పింది రణ్బీర్ ముత్తాత పృథ్వీరాజ్ కపూర్ డైలాగులు . తనదైన డైలాగ్ డెలివరీతో.. హావభావాలతో… మొగల్- ఏ – ఆజమ్ సినిమాలోని అక్బర్ ను అచ్చు గుద్దినట్టు అన్ స్టాపబుల్ స్టేజ్‌పై దింపేశారు బాలయ్య. ఇలా తన ట్యాలెంట్‌తో.. షోలో తన ఎదురుగా కూర్చున్న యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకు.. హీరో రణ్బీర్ కపూర్‌ను షాకయ్యేలా .. చెమటలు పట్టించారు బాలయ్య. అంత అద్భుతంగా బాలయ్య డైలాగ్ చెప్పడంతో సోఫాలో నుండి లేచి మరి అందరు చప్పట్లో ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా అంటే బాలకృష్ణకు ఎంతో ఇష్టమట. ఈ విషయాన్ని ఆయన రణ్‌బీర్ కపూర్‌తో చెప్పారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…