Balakrishna : చంద్రబాబు అరెస్ట్ తర్వాత బాలయ్య రాజకీయాలలో చాలా యాక్టివ్ అయ్యారు. పలు సభలని నిర్వహిస్తూ తెలుగు తమ్ముళ్లకి పలు సూచనలు చేస్తున్నారు. ఇటీవల జరిగిన ప్రెస్ మీట్‌లో ఎలాంటి ఆధారాలు లేకుండా కక్ష సాధింపుతోనే చంద్రబాబుపై కుట్ర చేశారని ఆయన మండిపడ్డారు. సంక్షేమాన్ని గాలికొదిలేసి ప్రతిపక్షాలపై కక్ష సాధింపులే లక్ష్యంగా సీఎం జగన్ పనిచేస్తున్నారన్నారు. జగన్ జైలుకు వెళ్లొచ్చారని అందరినీ పంపాలని ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇక తాజాగా ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ నేతల సమావేశంలో పాల్గొన్న బాలయ్య మాట్లాడుతూ..‘‘ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ ధైర్యంగా ఉండాలి. నియంత పాలనకు పోరాటాల ద్వారా బుద్ధి చెప్పాలి.ఎటువంటి ఆధారాలు లేకుండా చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారు అని అన్నారు.
జగన్ తన వైఫల్యాల నుంచే డైవర్టు చేయడానికే ఈ అరెస్టు చేశారు. నిజంగా అవినీతి జరిగి ఉంటే… అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదు.ఏ సీఎం అయినా పాలసీ మేకర్‌గా నిర్ణయం తీసుకుంటారు.అంతమాత్రాన అన్నీ అధినేతకు తెలియాలని లేదు. 340 కోట్లు పెద్ద స్కాం అని ఈ అవినీతి పరులు చెబుతున్నారు.జగన్మోహన్‌రెడ్డి మీద 31 కేసులు ఉన్న విషయం మరచిపోతే ఎలా..? ఆ కేసులు కొట్టేయలేదు… బెయిల్ మీద బయట తిరుగుతున్నాడు. పదేళ్ల నుంచీ ఈ కేసులు కోర్టులో సాగుతున్నాయి. జగన్మోహన్‌రెడ్డి దుర్మార్గుడు అంటూ కాంగ్రెస్ ఆ కేసులు వేసింది. నేను 16 నెలలు జైల్లో ఉన్నా కాబట్టి, చంద్రబాబు కూడా జైల్లో ఉండేలా జగన్‌రెడ్డి పగ బట్టారు.చంద్రబాబు, లోకేష్‌లకు వస్తున్న ప్రజాదరణను ఓర్వలేక పోతున్నారు.
జగన్ ఇచ్చిన హామీల అమలుపై దమ్ముంటే మాట్లాడాలి. మన ఉద్యమం, పోరాటాల్లో అందరూ భాగస్వామ్యం కావాలి.రాష్ట్రాన్ని అన్ని విధాలా నాశనం చేశారు.ప్రపంచ పటంలో ఏపీకి ఉనికే లేకుండా చేశారు.మనం ఆంధ్రులమని చెప్పుకునే పరిస్థితి లేకుండా చేస్తున్నారు తెలంగాణకు ధీటుగా ఏపీని చంద్రబాబు అభివృద్ధి చేశారు.జగన్ వచ్చాక జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండా చేశారు.పన్నుల భారాలు, విద్యుత్ ఛార్జీలు పెంపుతో ప్రజలను దోచేస్తున్నారు. ప్రజలకు అన్నీ తెలుసు, సమయం వచ్చినప్పుడు జగన్‌కి తప్పకుండా బుద్ధి చెబుతారు. ఈ సైకో సీఎంని ఓడించేలా అందరూ కలిసి పని చేయాలి అని బాలయ్య అన్నారు. అలానే ఓ సమ్మిట్‌లో ఏపీ గురించి అడిగితే జగన్ ఇలా నవ్వుతున్నారన ఆయనని ఇమిటేట్ చేశారు బాలయ్య.ఇక తన విగ్ గురించి కూడా కొందరు మాట్లాడుతున్నారు.. నా జీవితం తెరచిన పుస్తకం.. అందరికి తెలుసంటూ బాలయ్య స్పష్టం చేశారు.