Balakrishna Sentiments : నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మంచి జోష్ లో ఉన్నారు. అదృష్టం ఆయన చెంతనే ఉంది, పట్టుకున్నదల్లా బంగారంలా మారుతుంది. సినిమాలు హిట్ అవుతున్నాయి. చేసిన షోలు రికార్డులు తిరగరాస్తున్నాయి.ఈ క్రమంలో బాలయ్య సెంటిమెంట్‌కి సంబంధించిన వార్త ఒకటి హల్‌చల్ చేస్తుంది. బాలకృష్ణ సినిమా టైటిల్స్ చాలా పవర్ ఫుల్ గా ఉంటాయి. అలాగే బాలయ్యకు సింహా టైటిల్ బాగా కలిసి వచ్చింది. బాలయ్య సినిమా టైటిల్స్ లో చాలా వరకు సింహ అనే సెంటిమెంట్ కూడా ఉంటుంది. సమరసింహారెడ్డి – నరసింహనాయుడు – లక్ష్మీ నరసింహ – సింహ – జై సింహ సినిమాలు సింహ సెంటిమెంట్ తోనే వచ్చాయి. అలాగే సింహా ఇంగ్లీష్ టైటిల్ లయన్ సినిమాలో కూడా బాలయ్య నటించారు. సింహాతో టైటిల్ పెట్టుకుంటే అది హిట్ అనే చెప్పాలి.
మ అనే అక్షరం కూడా బాలయ్యకు చాలా సెంటిమెంట్….బాలక్రిష్ణ హీరోగా నటించిన ముద్దుల మామయ్య, ముద్దుల కృష్ణయ్య, ముద్దుల మేనల్లుడు, మంగమ్మగారి మనవడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాయి. తాజాగా ఆయన గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమా చేస్తున్నాడు. దీనికి మోనార్క్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇదే టైటిల్ పెడితే చిత్రం సూపర్ డూపర్ హిట్ కొట్టడ ఖాయం అని అంటున్నారు.

మరోవైపు బాలకృష్ణ తన సినిమాలని సంక్రాంతి సీజన్‌లో విడుదల చేసి మంచి హిట్స్ కొట్టాడు. మొత్తానికి ఆయన ఇలా సెంటిమంట్‌ని ఫాలో అవుతూ దూసుకుపోతున్నాడు. బాలయ్యకు సహజంగానే దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. ఆయన ఏ విషయంలో అయినా ముహూర్తాలు చూసుకుని పనులు ప్రారంభిస్తూ ఉంటారు. విశాఖ జిల్లాలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి అంటే బాలయ్యకు అమితమైన భక్తి. విశాఖ ఎప్పుడు వెళ్లిన కూడా ఆయన నరసింహ స్వామి వారి దర్శనం చేసుకుంటారు. బాలకృష్ణ నటించిన ఆదిత్య 369 సినిమా నుంచి ఈ సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు.