Taraka Ratna : నందమూరి తారకరత్న అకాల మరణం ప్రతి ఒక్కరిని ఎంతగా కలిచి వేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన మరణం నందమూరి కుటుంబ సభ్యులని ఎంతగానో బాధిస్తుంది. బాలయ్య కూడా తారకరత్న మృతిని జీర్ణించుకోలేనట్టుగా తెలుస్తుంది. నందమూరి తారకరత్న విషయంలో మొదటి నుంచి అన్నీ తానై దగ్గరుండి చూసుకున్న బాలకృష్ణ, నందమూరి తారకరత్న మరణించిన తర్వాత కూడా తారకరత్న కుటుంబానికి అండగా ఉంటానంటూ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. తారకరత్న ఫ్యామిలీకి ప్రస్తుతం బాలకృష్ణ పెద్ద దిక్కుగా మారారు.
తాజాగా బాలకృష్ణ తన మంచి మనసు చాటుకుంటూ గొప్ప పని చేశారు. తారకరత్న జ్ఞాపకార్థం హృద్యసమస్యలతో బాధపడుతున్న వారికి ఉచిత వైద్యం అందించాలని బాలయ్య గొప్ప నిర్ణయం తీసుకున్నారు. హృదయ సమస్యలు ఎంత ప్రమాదకరమో తారకరత్న విషయంలో బాలకృష్ణ దగ్గరుండి చూశారు. గుండె సమస్యలతో బాధపడుతూ చికిత్స ఖర్చులు భరించలేని పేదవారికి పూర్తి ఉచితంగా వైద్యం అందించబోతున్నట్లు బాలకృష్ణ ప్రకటించారు. హిందూపురంలో తాను నిర్మించిన హాస్పిటల్ లో హెచ్ బ్లాక్ కు తారకరత్న పేరు పెట్టారు.
అంతేకాదు నిరుపేదల వైద్యం కోసం రూ. కోటీ 30 లక్షల రూపాయలు పెట్టి ఆపరేషన్ పరికరాలను ఆ ఆసుపత్రిలో ఏర్పాటు చేశాడు బాలయ్య. గుండె సమస్యలకు ఉచిత వైద్యం బసవతారకం ఆసుపత్రి తో పాటు హిందూపురంలో బాలకృష్ణ నిర్మిస్తున్న ఆసుపత్రిలో కూడా అందుబాటులో ఉంటుంది. బాలకృష్ణ తన బంగారు మనసును మరోమారు చాటుకున్నారని అభిమానుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.. కొడుకు తారకరత్న పైన ప్రేమను ఇలా స్పష్టం చేయడంతో పాటు, హృద్రోగ బాధితులకు చికిత్స అందించడానికి బాలయ్య తీసుకున్న నిర్ణయం పట్ల ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు.