Gunasekhar : సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ తెరకెక్కించిన చిత్రం శాకుంతలం. మైథలాజికల్ లవ్‌స్టోరీగా రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 14న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ అయింది. ఈ సినిమా చూసిన వాళ్లు.. శాకుంతల మూవీ బాలేదని సోషల్ మీడియాలో తెగ కామెంట్లు చేశారు. మరోవైపు ఈ చిత్రాన్ని త్రీడిలో కూడా రిలీజ్ చేశారు. తీరా ఈ సినిమా థియేటర్లోకి వచ్చాక నెగెటివ్ టాక్ సొంతం చేసుకుంది. రివ్యూలే కాదు పబ్లిక్ టాక్ కూడా దారుణంగా ఉంది. ఈ చిత్రాన్ని దాదాపు రూ.60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించగా..గుణ టీమ్‌వర్క్స్‌పై నీలిమ గుణ నిర్మించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఆధ్వర్యంలో దిల్ రాజు పంపిణీ చేశారు.
భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇంతగా నిరాశపరచడంపై పలువురు సినీ ప్రియుల తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బాలకృష్ణ అభిమానులు గుణశేఖర్‌ను టార్గెట్ చేస్తూ ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తున్నారు. అసలు గుణశేఖర్‌కి, బాలయ్య అభిమానులకి ఎక్కడ చెడింది అనేది ఆరా తీస్తే.. ఎనిమిదేళ్ల క్రితం అంటే 2015లో అనుష్క ప్రధాన పాత్రలో, రానా, బన్నీ ముఖ్య పాత్రల్లో రుద్రమదేవి చిత్రం రూపొందగా, ఈ సినిమాకు గుణశేఖరే దర్శకుడు. తెలుగు జాతి చారిత్రక వైభవాన్ని చాటుతూ తెరకెక్కిన ఈ సినిమాకు వినోదపు పన్ను మినహాయింపు ఇవ్వాలని.. అప్పట్లో రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలను రిక్వెస్ట్ చేశాడు గుణశేఖర్.
అయితే అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. గుణశేఖర్ అభ్యర్థనను పెద్దగా పరిగణలోకి తీసుకోలేదు. అయితే ఆ తర్వాత రెండేళ్లకు అంటే 2017లో బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం విడుదల కాగా, దీనికి చంద్రబాబు ప్రభుత్వం.. పన్ను మినహాయింపు ఇచ్చారు. ఇక ఆ సంవత్సరం ప్రకటించిన నంది అవార్డుల్లో.. ‘రుద్రమ దేవి’ సినిమాకు కనీసం జ్యూరీ అవార్డ్ కూడ ఇవ్వకపోవడం పట్ల గుణశేఖర్.. ‘ప్రశ్నించడం తప్పా?’ అనే టైటిల్‌తో ఒక ఓపెన్ లెటర్‌ను ట్విట్టర్‌లో షేర్ చేయడం చర్చనీయాంంగా మారింది. అయితే శాకుంతలం సినిమా రిజల్ట్‌ని తీసుకొని బాలయ్య అభిమానులు గుణశేఖర్‌పై విరుచుకుపడుతున్నారు. నువ్వు తీసే సినిమా కంటెంట్, క్వాలిటీ మీద పెడితే.. నంది అవార్డు కాకపోయినా కనీసం.. సుబ్బిరామిరెడ్డి అవార్డయినా వస్తుందా అని ఎద్దేవా చేస్తున్నారు.