Balakrishna : స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబును రాజమండ్రి జైలులో ఉంచిన విషయం తెలిసిందే. స్కిల్ స్కామ్ కేసులో సీఐడీ చంద్రబాబును అరెస్టు చేసి.. ఆ తర్వాత ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టింది. దీంతో ఆయనకు న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్ విధించగా.. చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. మూడు రోజులుగా చంద్రబాబు జైల్లో ఉండగా ఆయన మద్దతుదారులు, టీడీపీ కార్యకర్తలు ఆయన్ను విడుదల చేయాలంటూ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం మాజీ సీఎం చంద్రబాబును అక్రమంగా కేసులో ఇరికించారని.. లేని పోని ఆరోపణలు చేస్తున్నారంటూ ఆయన మద్దతుదారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
అయితే చంద్రబాబు అరెస్ట్ పై పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నా కూడా ఎన్టీఆర్ మాత్రం ఇంత వరకు స్పందించలేదు. ఎన్టీఆర్ స్పందించకపోవడంపై పలువురు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈ విషయంపై తాజాగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు వస్తారు. ధైర్యంగా మాట్లాడలేరు. ఇది ఫిలిం ఇండస్ట్రీ నుండి నా అభిప్రాయం. ఎవరు మాట్లాడిన మాట్లాడకపోయిన తమకేమి కాదన్నట్టు బాలయ్య స్పందించారు. బాలయ్య వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.
బాలకృష్ణ-ఎన్టీఆర్ మధ్య దూరం పెరిగిందనేది నిజం. చెప్పాలంటే ఈ గొడవలు ఇప్పటివి కావు. 2009లో టీడీపీ తరపున ఎన్టీఆర్ ప్రచారం చేశారు. అయితే పార్టీ గెలవలేదు. తర్వాత ఏమైందో తెలియదు… ఎన్టీఆర్, హరికృష్ణ టీడీపీతో డిస్టెన్స్ మైంటైన్ చేస్తూ వచ్చారు. అప్పుడప్పుడు సినిమా వేదికలపై బాలయ్య, ఎన్టీఆర్ కలిశారు. టీడీపీ కార్యక్రమాల్లో ఎన్టీఆర్ పాల్గొనడం లేదు. చివరికి తాతయ్య ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు హాజరు కాలేదు. చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేస్తే స్పందించలేదు. బాలకృష్ణ, చంద్రబాబు అంటే ఇష్టం లేకే ఎన్టీఆర్ ఇలా చేస్తున్నాడనే వాదన బలంగా వినిపిస్తోంది. బాలకృష్ణ ఫ్యాన్స్, టీడీపీ వర్గాలు ఎన్టీఆర్ ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ఇలా ప్రవర్తించడానికి ఆయనకు బాలయ్య సరైన గౌరవం ఇవ్వకపోవడమే అనే మరోవాదన ఉంది. వైసీపీ నేతగా ఉన్న కొడాలి నాని చెప్పినట్లు వింటూ ఎన్టీఆర్ బాలయ్య కుటుంబానికి దూరం అవుతున్నాడనే వాదన తెరపైకి వచ్చింది.