Balakrishna : గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఏపీలో సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే.వారాహి విజయ యాత్రలో భాగంగా ఇటీవల గ్రామ, వార్డు వాలంటీర్ల విషయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో వివిధ పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తల ఆధారంగా పవన్ కళ్యాణ్‌పై కేసు నమోదుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జులై 9వ తేదీన ఏలూరు సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 29 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని, వీరిలో కొంత మంది మాత్రమే ట్రేస్ అయ్యారని.. మిగతా వారు ఏమయ్యారో తెలియదని వ్యాఖ్యానించారు.
వాలంటీర్లు సేకరించిన సమాచారం సంఘ విద్రోహ శక్తుల చేతుల్లోకి వెళ్తోందని ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలపై.. పరువు నష్టం కేసులు పెట్టాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్లను ఆదేశిస్తూ గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా రీసెంట్‌గా మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నోటీసులు అందజేశారు. అయితే పవన్ కళ్యాణ్ కి నోటీసులు అందజేయడంపై జనసైనికులతో పాటు టీడీపీ నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.బాలకృష్ణ రీసెంట్‌గా ఓ ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ.. వైసీపీ నాయకుల చర్యలని ఖండించారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర చేస్తున్న నేపథ్యంలో టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోందని, లోకేశ్ యువగళం పాదయాత్ర చేస్తుండడంతో ప్రభుత్వం భయపడుతోందని విమర్శించారు. అందుకే లోకేశ్ పాదయాత్రకు ఆంక్షలు, నిబంధనలు విధిస్తున్నారని తెలిపారు. తన అల్లుడు లోకేశ్ ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు, యువతకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీసేందుకే యువగళం చేపడుతున్నాడని బాలకృష్ణ స్పష్టం చేశారు. తాను అప్పుడప్పుడు వెళ్లి లోకేశ్ ను కలుస్తుంటానని వివరించారు. పవన్ అంత మంచోడిని తాను కానని చెప్పిన బాలకృష్ణ.. ఆయన దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తే మగాడివి అయిపోతావా అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…